పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

565 పె.అ.రేకు:0050-01 ధన్నాసి సంపుటము: 15-281 పల్లవి: తతిగొని యేమఱక తలఁచఁగవలెఁ గాక హితవై నీ నామ మున్నదిఁక నేల చింతా చ. దప్పిగొన్నవానికి శీతలోదకమువలె కప్పి పతివ్రతకు మంగళసూత్రమువలె ముప్పిరి దరిద్రునకు ముంగిటిధనమువలె నెప్పుడు నీ నామ మున్న దిఁక నేల చింతా చ. నలిరేఁగి విషదగ్గునకు నిర్విషమువలె యిల నెండ దాఁకినదేహికి మంచి నీడవలె చెలఁగి జాత్యంధునికి సిద్దాంజనమువలె నెలమి నీ నామ మున్న దిఁక నేల చింతా చ. పట్టభద్రునోరికి గప్రఁపుఁబలుకువలె గుట్టునఁ దండ్రికి ముదుఁగొడుకువలె గట్టిగా శ్రీవేంకటేశ కడఁగి నా నాలికెకు యిట్టే నీ నామ మున్నదిఁక నేల చింతా రేకు: 0372-03 లలిత సంపుటము:04-424 పల్లవి: తథాకురుష్వ ముదా మామద్యేవ అధోక్షజస్తే అనుదాసాహం చ. తవాస్మి శరణం దహరాహం భవదురితాని భOజ మము భువి కృతం చ యా పురా ప్రతిజ్ఞాం జవన దదామి సర్వేభ్య ఇతి చ. ప్రజామి శరణం వరద త్రవాహం త్యజితానుబంధ దర్మ మము భుజకృతాం పురా ప్రతిజ్ఞాం వృజినై ర్మోక్షయిష్యామీతి చ. చింతితం మయా శ్రీ వేంకటేశ కింతు త్వం మయి కృపాంకురు తంతుహి పురాకృతం ప్రతిజ్ఞాం అంతగతిం నయూమీతి మహి రేకు: 0034-06 సాళంగం సంపుటము: 01-213 పల్లవి: తన కర్మమెంత చేఁతయు నంతే గొనకొన్న పనియంత కూలీనంతే చ. తలఁపులో హరి నెంత దలఁచె నేఁడే వాని కలిమియు సుఖమును గల దంతే తులఁదూ(చఁ బైఁడెంత తూఁకము నంతే నెలకొన్నపిండెంత నిప్పటీ నంతే చ. సిరివరుపూజెంత సేసె నేఁడే వానిదరియును దాపు నెంతయు నంతే పురిగొన్న యీవెంత పొగడూ నంతే నరపతిచనవెంత నగవూ నంతే