పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

564 రేకు: 0373-01 రామక్రియసంపుటము: 04-428 పల్లవి: తతిగాని యీ పాటు దైవమా విచారించవే కతలాయఁ జెప్ప నేఁడు కలికాలమహిమ చ. తుటుములై భూసురుల తుండెములు మొండెములు యిటువలె భూతములు యెట్టు మోఁచెనో అటు బాలుల రొదలు ఆకాశమె ట్లోరిచెనో కట కటా యిటూయఁ గలి కాల మహిమ చ. అంగలాచే కామినుల యంగ భంగపు దోఁపు లింగితాన మింట సూర్య డెట్టుచూచెనో పొంగు నానాజాతిచేత భువనమెట్టానెనో కంగి లోకమిట్టాయం కలికాలమహిమ చ. అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలావ సరి ధర్మదేవతెట్టు సమ్మతించెనో పరధన చూరకెట్టు పట్టాయనో లక్షి కరుణ యెందణఁగెనో కలికాలమహిమ చ. దేవాలయాలు నానాదేశములెల్లాఁ జొచ్చి దేవఁగా నెట్లుండిరో దేవతలు తావులేలే రాజులకు దయ గొంత వుట్టదాయ కావరమే ఘనమాయఁ గలి కాలమహిమ చ. నిరపరాధులఁ జంపి నెత్తురు వారించఁగాను తెరల కెట్టుండిరో దిక్పాలులు విరసవర్తనలుండే విపరీతకాలమున గరువాలుఁ గపటాలే కలికాలమహిమ చ. వుపమించి దంపతులు వొకరొకరినిఁ జూడ చపల దుఃఖములతో సమయంగాను తపములు జపములు ధర్మము లెందణఁగెనో కపురుcబాపాలు నిండెఁ గలికాలమహిమ చ. తలలు వట్టీడువఁగా తల్లులు బిడ్డలవేయ తలపెట్టుండెనో యంతర్యామికి మలసి ముక్కలుగోయ మరుఁడెట్టు వోరిచెనో కలఁకలే ఘనమాయఁ గలికాలమహిమ చ. దీనత లోఁబడి గుండెదిగులసురుసురులు వానినెట్లు లోఁగొనో వాయుదేవుఁడు గూను వంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తిక గోయఁ గానఁబడె నింతేసి కలికాలమహిమ చ. పలుమారు నమ్మించి ప్రాణములు గొనఁగాను యిలఁ దమలోఁ బ్రాణాలెట్లుండెనో నెలవై శ్రీ వేంకటేశ నీవే యెరుఁగుదువు కలుషమే ఘనమాయఁ గలికాలమహిమ