పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

563 పె.అ.రేకు : 0032-06 దేశాక్షి సంపుటము: 15-182 పల్లవి: తగులు వీరికి గుఱి తాఁ దానే తగు జీవుఁడు మఱి తాఁ దానే చ. పలువుపమలచే బ్రహ్మాండకోట్లు తలఁచే తలఁపులు తనలోనే వులుకక నానాయోనిబంధముల తలఁగనియ్య దిది తనలోనే చ. సతతము భువిపై చవులు సారములు తత్రి నిండు కొనెను తనలోనే రతుల కామినుల రచన లెల్లను స త్రతమును భోగించెఁడి దనలోనే చ. ధనధాన్యము లెంతయు నార్జించిన తనయుఁడింతైన తనలోనే ఘనుఁడగు శ్రీవేంకటపతి యున్నాఁడు తనువు దాల్చుకొని తనలోనే చి.ఆ.రేకు:0006-05 లలిత సంపుటము: 10-035 పల్లవి: తచ్చిచూచితేఁ జాలు దైవమే కలఁడుగాక హెచ్చినమాయలఁ బడ నేల మాకు నిఁకను చ. సారె సారె నే నెంతసంపదలు గోరినాను పాశీరచి నీదేహమెకా భోగించేది యీరీతి మనసు దా నెన్నటికిఁ దనిసీని గారవాన హరి నిన్నుఁ గన్నదె దక్కెను చ. పలుమారు చావులేనిబదుకు కాసపడేది యిలలోసంసారమెకా యేఁ జేసేది కలిగినయాస యేకాలమున ముదుసును అలరి విష్ణునిశరణన్నదె నిలిచె చ. వేడుకతో ఘనమైనవిద్యలు నేరిచినాను జోడుగా నిందరికిని చూపు టింతేకా వీడని తలఁపుతో శ్రీవెంకటనాథునిఁ గొల్చి యీడేరి బదుకు టె యెన్నికింతె కాకా