పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

562 కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే రేకు: 0311-05 దేసాళం సంపుటము: 04-065 పల్లవి: తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా చక్కఁగ శ్రీహరి నీశరణే చాలు చ. మోపులు మోవఁగనొల్ల ములుగఁగ నేనొల్ల తీపు నంజనొల్ల చేఁదు దినఁగనొల్ల పాపపుణ్యాలవి యొుల్ల భవమునఁ బుట్టనొల్ల శ్రీపతినే నిరతము చింతించుటే చాలు చ. వడిగాఁ బరువులొల్ల వడిరింపనేనొల్ల వెడఁగుఁజీఁకటి యొుల్ల వెలుఁగూనొల్ల యిడుమల వేఁడనొల్ల యొక్కువ భోగములొల్ల తడయక హరి నీదాస్యమే చాలు చ. అట్టె పథ్యములొల్ల అవుషధము గొననొల్ల మట్టులేని మణుఁగొల్ల మైల గానొల్ల యిట్టె శ్రీవేంకటేశుఁ నిరవుగ సేవించి చుట్టుకొన్న యానందసుఖమే చాలు పె.అ.రేకు:0014-04 శుద్ధదేశి సంపుటము: 15-077 పల్లవి: తక్కిన వెల్లాఁ దహతహలే నిక్కపు శ్రీహరి నిజమగు తెలివీ చ. ధరణి సమస్తము దైవాధీనము పోరిఁ బ్రాణుల నేర్పులఁ బడవు వరుసఁ దమంతనే వచ్చిన వెల్లా హరికరుణని ముద ముందుట తెలివీ చ. కావలసినపని కర్మాధీనము వావిలి నది గడవఁగ రాదు దావతి కుడువక తప్పులఁ బొరలక భావము సంతస పఱచుట తెలివీ చ. పుట్టిన తనువులు భోగాధీనము లట్టిట్టని తెలియఁగ రాదు గట్టిగ శ్రీవేంకటపతి నేవే నెట్టన నమ్మట నిజమగు తెలివీ రేకు:0255-02 ధన్నాసి సంపుటము: 03-315 పల్లవి: తగు మునులు ఋషులు తపములు సేయఁగ గగనము మోచియుఁ గర్మము దెగదా చ. ధరణీధర మందరధర నగధర చిరకౌస్తుభధర శ్రీధరా కరిఁగా చితి కాకముఁ గాచితి నీ– కరుణకుఁ బాత్రము గలదిదియూ చ. భవహర మురహర భక్తపాపహర భువనభారహర పురపూరా కవిసిన వురుతను గద్దను మెచ్చితివివల నీదయకు నివియా గురుతు చ. శ్రీవేంకటపతి శేషగరుడపతి భూమనితాపత్రి భూత్రపత్రి గోవుల నేలిత్రి కోఁతుల నేలితి పావనపుఁ గృపకుఁ బాత్రము లివియా