పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

561 వెరవ లెంచుకోఁబోతే వేరే మాకు గతి లేదు నిరతి మా బదుకులు నీకు సెలవయ్యా . నిండిన మా కోరికలు నీ పెర రేఁపులే వుండఁ జోటు నీకు నా వుల్లములోనే చండి పెట్టి మాకైతే స్వతంత్ర మించుకా లేదు నిండిన మా చేఁతలెల్లా నీకే సెలవయ్యా . యిదె మా సంసారములు యిట్టె నీ కల్పితములు తుదమొదలును నీవే తోడునీడవు యెదుట శ్రీవేంకటేశ యేలిన వాఁడవు నీవే నిదుర మా దినములు నీకే సెలవయ్యా రేకు:0105-02 సాళంగంసంపుటము:02-026 పల్లవి: జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల చ. నానావిధాల నివి నమ్మేరు సుండి అలరి యింతుల యధరామృతము లివియెల్ల కాలకూటవిషముల కరణి సుండి శీలముతో వీరల చెట్టలు వట్టుటలెల్లా బాలనాగాలఁ దొడికి పట్టుట సుండి కాంతలు నవ్వుచునైనాఁ గన్నులఁ జూచిన చూపు పంతమున నలుగుల పాఁతర సుండి బంతుల నెదుటనున్న పడఁతుల చన్ను లివి కంతల నొడ్డిన బడిగండ్లు సుండి . జవ్వనపుఁ గామినుల సరసపు మాటలెల్లా మవ్వమైనయట్టి చొక్కు మంత్రాలు సుండి యివ్వలను శ్రీవేంకటేశ్వరుదాసుల కివి చివ్వనఁ జెప్పినట్టు చేసేవి సుండి రేకు:0175-06 వరాళి సంపుటము:02-374 పల్లవి: డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం చ. చ. మీనకూర్మ వరాహ మృగపతి అవతారా దానవారే గుణశౌ రే ధరణిధర మరుజనక వామన రామ రామ వరకృష్ణ అవతార శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ దారుణ బుద్ధ కలికి దశవిధ అవతారా శీరపాణే గోసమూణే శ్రీవేంకటగిరికూటనిలయ రేకు:0177-04 బౌళి సంపుటము:02-385 పల్లవి: తందనాన ఆహి తందనాన పురె చ. చ. త్రOదనాన భళా త్రOదనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె కందువగు హీనాధికములిందు లేవు ఇందులో జంతుకుల మింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటేఅండనే బంటునిద్రదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటేఛండాలుడుండేటి సరిభూమి యొకటే అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే ఘనకీటపశువులకు కామసుఖ మొకటే దిన మహోరాత్రములు తెగి ధనాడ్యున కొకటే వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు . కొరలి శిష్టాన్నములు గొను నాఁకలొకటేతిరుగు దుష్టాన్నములు దిను నాఁకలొకటే పరగ దుర్గంధములపై వయువు నొకటేవరుసఁ బరిమళముపై వాయువు నొకటే . కడగి యేనుఁగుమీఁదఁ గాయు యెండొకటే పుడమి శునకముమీఁదఁ బొలయు నెండొకతే