పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

560 యిహమున వైరాగ్య మొక్కుడు సహజకర్మములు శతములకంటే అహిశయనుని భక్తధికము చ. ధరఁ దపములనంతంబులకంటే గరిముల శాOతము ఘనము విరసాచారము వేవేలకంటే పూలినామపఠన మ8)కము చ. ఆవల వ్రతములు అన్నిటికంటే శ్రీవైష్ణవమే శేఖరము శ్రీవేంకటేశ్వరుచేఁతలె యివిగన సేవ యిదొకటే చింతింప ఘనము రేకు: 0320-02 గుండక్రియ సంపుటము: 04-113 పల్లవి: జ్ఞానము నెఱఁగము అజ్ఞానము నెఱఁగము శ్రీనాయకుఁడ నీసేవకుఁడ నేను చ. అరుత్రC గట్టినతాళి యువె మనమూలికలు సరుస మోఁచిన డాగు శంఖచక్రములు వరుస నొసల గురివ్రాసినది తిరుమణి ఇర వెరిఁగితి మిఁక నెపుడైనఁ గావుము చ. పళ్ళెము ప్రసాద మింతే పసగా నారుచు లివె పిల్లు నేఁ బొగడేవి నీబిరుదులు యెల్లపుడుఁ బూజించేది ఇది నీరూపుపతిమ కల్లలే దిందుల నీవు గన్నదింతే కానుపు చ. నిక్కము నేఁ జొచ్చినది నీలెంకతనము చక్కనాజీవనము నీశరణాగతి యొక్కువ శ్రీవేంకటేశ యొదలో నున్నాఁడ నిదె చిక్కిన దేమియులేదు చిత్తమింతే ఇఁకను రేకు: 0136-01 ధన్నాసి సంపుటము: 02-148 పల్లవి: జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము నానార్ధములు నిన్నే నడపె మాగురుఁడు చ. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై యజ్ఞానపు పశువు బOధిOచి కలసి వైరాగ్యపు కత్తులఁ గోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు చ. మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి చక్కగా సంకీర్తనసామగానము చేసి యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు చ. తదియ్యగురుప్రసాదపు పురోడాశ మిచ్చి కొదదీర ద్వయమను కుండంబులు వెట్టి యొదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె యెదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు రేకు:0202-05 లలిత సంపుటము: 03-011 పల్లవి: జ్ఞానినైనా నీకుఁ బో దజ్ఞానినైనా నీకు బోదు నేను చేసిన నేరమి నీకే సెలవయ్యా చ. గరిమ మా పుట్టుగు నీ గర్భవాసములోనే అరయ మా మోక్షము నీ యరచేతిదే