పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

559 జిగిఁ దొడమిఁదట శ్రీమహాలక్షి తగు నీకు నిటువంటి తగవులెల్లాఁ జెల్లు యొగ సక్కేలాడ మాకు నేలయ్య నిన్నును చ. కట్టినది పైఁడికాశ కంబములోన వునికి నెట్టుకొన్ననవ్వులు నీలోనివే యిట్టివల్లా నీకమరు యెన్నిలేవు నీచేఁతలు అట్టిట్టని నిన్ను మాకు నడుగనేమిటికి చ. అమరుల కేలికవు అసురలకు వైరవి రమణఁ బ్రహ్లాదునకు రక్షకుఁడవు కొమరై శ్రీవేంకటాద్రిఁ గొత్తలు నీగుణములు సముకానఁ బలుమారు సంతోసించే మిఁకను పె.అ.రేకు:0022-01 దేశాక్షి సంపుటము: 15-123 పల్లవి: జూడఁగఁ జూడఁగ సుడిగొనె మాయలు వేడుకతో నిన్ను వెదకే దెపుడో చ. కడప(గC గడపఁగఁ గాలము గడచెను జడిసిన వెనకటి జన్మముల నడవఁగ నడవఁగ నడచె సంసారము యెడయక హరి నిన్ను యెఱిఁగే దెపుడో చ. కోరఁగఁ గోరఁగఁ గూడె లంపటము గారవమగు నిజకర్మముల మేరలు మీఱఁగ మించెను మమతలు కూరిమి హరి నిన్నుఁ గొలిచే దెపుడో చ. నిలుపఁగ నిలుపుఁగ నిOడెను జ్ఞానము అలరఁగ శ్రీహరి అనుజ్ఞను యిలలో శ్రీ వేంకటేశ నీమఱఁ గలరి చొచ్చి కొనియాడితి మిపుడు రేకు:0280-03 దేసాళం సంపుటము: 03-461 పల్లవి: జోజో యని మీరు జోల వాడరో సాజపు జయంతి నేడే సఫల మిందరికి చ. అదె చంద్రోదయమాయ హరి యవతారమందె మొదల జాతకర్మములు సేయరో అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేసి కదిసి యిట్టె నామకరణముఁ జేయరో చ. కాయము దేవకికిచ్చిగక్కన వాసుదేవుని కీయరో గంధాక్షత లిటు విడేలు కాయకపు గాడిదెకు కవణము వెట్టి మరి వీయపు చుట్టాలెల్ల వీడు వెట్టరో చ. షోడశోపచారములఁ జొక్కించి శ్రీవేంకటేశుఁ బాడరో ధర్మము నిల్పె భార మణఁచె వోడించెఁ గౌరవదానవులఁ గంసాదులఁ జంపె ఆడనే పాండవులఁ గాచెనని యర్ఘ్యమియ్యరో రేకు: 0339-06 బౌళిరామక్రియ సంపుటము: 04-231 పల్లవి: జ్ఞానంబొకటే జగమున కధికం మరి నానావిధములు నటనలు చ. బహుదానఫలము పడయుటకంటే