పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/560

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

558 యొక్కడెతా నెరఁగడు యిటు గొన్నాళ్లు చక్కఁగ నంతటిలోనె జవ్వనసాయమునాఁడు మిక్కిలి పోకలఁ బోయి మెరయుఁ గొన్నాళ్లు చ. ఆఁకలీ నొక్కటె యటు జనించిననాఁడు వోఁకరెన్నఁడో దాఁగి వుండుఁ గొన్నాళ్లు కాఁకల నంతటిలోనె కమ్మరఁ బుట్టినప్పుడే వేఁకమై పలురుచులు వెదకుఁ గొన్నాళ్లు చ. దేవుఁడూ నొక్కఁడే తెలియుదాఁకాఁ బెక్కు దేవతలై భ్రమయించు దేహము గొన్నాళ్లు చేవమీర నంతలోనె శ్రీవేంకటేశుఁడై సేవ గొని సుజ్ఞానిఁ జేసుఁ గొన్నాళ్లు రేకు: 0.179-01 సాళంగనాట సంపుటము:02-392 పల్లవి: జీవుని కేకాలము శ్రీహరి చేరువబంధువుఁడీతఁడు భావములోపలి పెరరేఁపకుఁడై భక్తి చేకొనును యీతఁడు చ. పరమున నిహమున వెంటవెంటనే పాయని బంధువుఁడీతఁడు ధరఁ దనుఁదలచిఁన మారుకు మారై తా రక్షించును యీతఁడు విరివిగ నింద్రియవిషయభోగముల విందులు వెట్టును యీతఁడు వురుగతిఁ జిత్రపురూపుల దేహపుటుడుగర లిచ్చును యీతఁడు చ. వడిఁ గలకాలము యిరువదియొక్కటవావుల బంధువుఁడీతఁడు బడిబడిఁ జైతన్యంబై యిన్నిటఁ బనులకు నొదగును యీతఁడు జడిగొని యేకాంతలోకాంతమై మతిసంగతి నాపుఁడీతఁడు పొడలుచు వైదికలౌకికముల నొకపొత్తునఁ గుడుచును యీతడు చ. ఘననిధినిక్షేపములిచ్చేటి వుపకారపుబంధువుఁ డీతఁడు అనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతఁడు ననిచిన శ్రీవేంకటేశ్వరుఁడై యిటు నాపాలఁగలుగు నీతఁడు పనివడి అరులను సూడువట్టి కడుఁ బగసాధించును యీతఁడు రేకు:0118-01 దేసాళం సంపుటము: 02-103 పల్లవి: జీవునికి నిటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు కావక పోరాదు మాకుఁ గల యంతర్యామివి . పైపై నెదురుకట్లఁ బంచదార వుండఁగాను చేపట్టి యడిగి తెచ్చి చేఁదు దిన్నట్లు పూపలైన చేతిలోనే పుణ్యములు వుండఁగాను పాపములు చవియంటాఁ బట్టబొయ్యీ జీవుఁడు చ. యింటిలోనే నవరత్నా లెన్నియైనా నుండఁగాను కంటగించి గాజుఁబూస గట్టుకొన్నట్లు వెంటనే హరినామాలు వేయివేలై వుండఁగా జంట నితరమంత్రాలు జపియించీ జీవుఁడు చ. చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండఁగాను వేసరక వెలయాలి వెతకినట్లు మేసుల శ్రీవేంకటేశ మీదాస్యమే వుండఁగా వాసిఁ బరులఁ గొలువనే వడిఁ గోరీ జీవుఁడు రేకు: 0328-05 లలిత సంపుటము:04-164 పల్లవి: జూటుందనాలవాఁడవు సుగ్రీవనారసింహ పాటించి నిన్ను నేము పంగించేవారమా చ. మొగము సింహపురూపు మొగి మై మానిసిరూపు చ