పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

557 పట్టి తెంచివేయక పాయనేరవు గట్టిగా సంసారములోఁ గలిగిన లంపటాలు ముట్టి నీ వల్లనేకాని మోయరావు చ. పంచభూత వికారాలు పరమాత్ముఁడా నీవే కొంచక నీయాజ్ఞఁగాని కొద్ది నుండవు అంచెల జగములోని ఆయా సహజములు వంచుక నీవల్లఁగాని వైపుగావు చ. చిత్తములో విజ్ఞానము శ్రీవేంకటేశ నీవె హత్తించి చూపినఁగాని యంకెకురాదు సత్తుగా నిన్నిటికి నీశరణుచొచ్చితి మిదె నిత్తెముఁ గావఁ బ్రోవ నీయిచ్చే యిఁకను రేకు: 0363-02 గుండక్రియ సంపుటము: 04-370 పల్లవి: జీవుఁడు నిత్యుఁడు యీ చింత లెట్టు దొరకెనో భావించ నిది యేఁటి ప్రచారమో చ. తనువు మోచిత్రినంటా తరుణుల పారెందులంటూ దినదిన రుచులంటాఁ దిరిగేము మొనసి సంసారమే మోహినీగజమై వెనకఁ దలఁచ మేటి వికారమో చ. కడుపు నిండినదంటాఁ గమ్మర నా(కలియంటా వెడఁగు భోగములంటా వెదకేము వుడివోని యాసలే వుబ్బుఁగవణములై విడువదు మతి కేటివిచారమో చ. దివము రాత్రిలి యుOటా తెలివOటూ నిదురOటూ భువిఁగాఁపురములంటాఁ బొరలేము ఇవల శ్రీ వేంకటేశ యింతలో నీ దాసినని వివరము గంటి నెట్టి వివేకము పె.అ.రేకు:0051-04 బౌళి సంపుటము: 15-290 పల్లవి: జీవుఁడు ప్రకృతియును శ్రీపతియుఁ గలఁడని భావించుకొంటే నిహపరములు గలుగు చ. నీటికడవలో చంద్రునీడ దిష్టాంత మయితే తాటించి కర్మము దేహిఁ దగుల నేలా సాటి ప్రతిబింబమైతే చైతన్యము రా నేల మాటున నప్పటి నీ జన్మములు రా నేలా చ. జగము కప్పచిప్పరజతబ్రాంతివలె నైతే నిగమము లీ యర్ధము నిలుపనేలా పగటున నత్యముపనికిఁ దెచ్చుకొనేల అగణితమైన సృష్ట్యాదులు రా నేలా చ. చినుమయపు బ్రహ్మము చిక్కించి మాయ గప్పితే ననుపమ పరిశుద్ధ మనఁగ నేలా యొనసి శ్రీవేంకటేశుఁడితనినే శరణని ఘనుఁడౌట గాక వట్టి కలఁక లేలా రేకు:0350-06 బౌళి సంపుటము:04-296 పల్లవి: జీవుఁడూ నొక్కటే చిత్తమూ నొక్కటే వేవేలు మాయలచే వెలయుఁ గొన్నాళ్లు చ. వొక్కటే దేహము వూరకే బాల్యావస్థ