పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

556 పె.అ.రేకు: 8007-09 గుండక్రియ సంపుటము: 15-453 పల్లవి: జీవాత్ముని దీమముగాఁ జేసుక యిందరిఁ గూడుక కావలి దిరిగెద రిందుకుఁ గర్తలి దెవ్వరొకో చ. పంచేంద్రియము లిదెవ్వరు పంచభూతము లెవ్వరు పంచప్రాణములనియెడు ప్రభువు లి దెవ్వరొకో పంచమహపాతకములఁ బాట్లఁబడువా రెవ్వరు పంచత్వంబునఁ బొండఁగ భారకు లెవ్వరొకో చ. తప్పక తిరువేంకటపతిఁ దలఁచెడివారది యెవ్వరు వొప్పగు సౌఖ్యము వొడగవ యోగ్యులి దెవ్వరొకో వొప్పల తప్పుల చేఁతల నొడఁబడ నొల్లక సకలముఁ దప్పించుక పుణ్యులు గాఁదగు వా రెవ్వరొకో రేకు: 0352-05 వరాళి సంపుటము: 04-307 పల్లవి: జీవుఁడించుకంత చేఁత సముద్రమంత చేవెక్కి పలుమారుఁ జిగిరించీ మాయ చ. కోపములైతేను కోటానఁగోట్లు దీపనములైతేను దినకొత్తలు చాపలబుదులు సమయుని రాసులు రాపాడీఁ గడవఁగరాదు వోమాయ చ. కోరికలైతేను కొండలపాడవులు తీరని మోహాలు తెందేపలు వూరేటిచెలమలు వుడివోనిపంటలు యీరీతినే యెలయించీని మాయ చ. మునుకొన్నమదములు మోపులకొలఁదులు పెనఁగినలోభాలు పెనువాములు నినుపై శ్రీవేంకటేశ నీదాసులనంటదు యొనసి పరులనైతే యీ(దించీ మాయ రేకు:0063-06 దేశి సంపుటము: 01-327 పల్లవి: జీవుఁడెంతటివాఁడు చిత్త మెంతటిది తన దైవికము గడవ నెంతటివాఁడు దాను చ. విడిచిపాశీవని యూస విజ్ఞానవాసనలఁ గడచి మున్నాడె నెక్కడివివేకములు వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధముల మెడవట్టి నూకె నేమిటికింక నెరుక చ. పాయనియ్యనిమహాబంధ మధ్యాత్మతో రాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగు మాయనియ్యనికోపమహిమ కరుణామతిని వాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పదము చ. సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని నెరఁగనియ్యదు దనకు నేఁట్టిపరిణతలు తిరువేంకటాచలాధిపునిమన్ననఁగాని వెరసి యిన్నటి గెలువ వెరవు మఱిలేదు రేకు:0248-04 భైరవి సంపుటము: 03-275 పల్లవి: జీవుఁడ నేనొకఁడను సృష్టికిఁ గర్తవు నీవు యూవల ధర్మపుణ్యములివివో నీచేత్రివి చ. పుట్టినయట్టి దోషాలు పురుషోత్తమా నీవు