పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

555 రేకు:0284-05 సాళంగంసంపుటము: 03-486 పల్లవి: జీవన్ముక్తులము శ్రీపతి దాసులము భావించవో మమ్మును ప్రపంచపు మాయా చ. యివల దానధర్మము లేమిఁ జేయుట లేదు తవిలిన పాతకాలు దైవమే వహించుకొనె భువిలోన నా కిఁక బుట్టఁబని లేదు లేదు భవరోగవైద్యుఁడు శ్రీపతి గలఁడు గాన చ. యెలమి స్వర్గాది లోకాలేమీఁగోరుట లేదు కల వైకుంఠము హరి కాలమునాఁడే యిచ్చె తొలుత నాకుఁ జావుల తోడి సడ్డ వద్దు వద్దు బలువైన యచ్యుతుని బంట్లము గాన చ. పూపసుఖమూ నొల్లము పొంచి దుఃఖమూ నొల్లము చేపట్టి బ్రహ్మానందము శ్రీవేంకటేశు డిచ్చెను దూపయు నాఁకటికిఁగా తోదోపు మా కిఁక వద్దు కాఁ పమృతమథనుఁడు గలఁ డిట్టే కాన రేకు: 0314-02 మంగళకౌశిక సంపుటము: 04-079 పల్లవి: జీవములు దవ్వవోయ చీమలునుఁ బుట్టచొచ్చె వేవేలయిన నిది విడువనయ్యా చ. చింతలన్నియుఁ బాసె చిత్తమింతట రోసె యెంత లే దీయూసలు యిఁకనేలయ్యా అంతలో గురునిగంటి హరికే శరణంటి దొంతుల భవములాల తొలఁగరో చ. గక్కనఁ గడువు నిండె కన్నుఁ దనిసె నిదె యొక్కడి పలురుచులు యిఁకనేలయ్యా చిక్కె విజ్ఞానము నేఁడె జిహ్వ నారాయణుఁగూడె వుక్కునఁ బాపములాల వుడుగరో చ. జీవుఁడు పాపనమాయ దేవుఁడే జీవనమాయ యీవలి యావని కర్మమిఁక నేలయ్యా శ్రీవేంకటేశు భక్తిఁ జేరి శరణంటి నేను భావపుబంధములాల పారరో రేకు:0008-02 ఆహిరి సంపుటము: 01-050 పల్లవి: జీవాతుమై యుండు చిలుకా నీ వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా చ. ఆతుమపంజరములోన నయమున నుండి నా చేతనే పెరిగిన చిలుకా జాతిగాఁ గర్మపుసంకెళ్ళబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా భాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా చ. బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా అదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా వదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా చ. నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా శ్రీవేంకటాద్రిపె చిత్తములో నుండి సేవించు కొని గట్టి చిలుకా దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా యేవియును నిజముగా వివి యేఁటికని నాకు నెఱఁగించి నటువంటి చిలుకా