పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

554 రేకు: 0389-04 సాళంగనాట సంపుటము: 04-517 పల్లవి: జయము మనది వనచరులాల రయమున దర్మదారలు తుత్తుతూ చ. రక్కసుల మీఁద రాముఁడలిగె నలుదిక్కుల నడవుఁడు తిడిం తిడిం యొక్కుఁడు సేనలు యిటు మొరయింపుఁడు ఢక్కా నినదము ఢమఢమఢమం చ. కుటిలదానవులఁ గొట్టుఁడు కోటలు త్రటుకున దాఁటుఁడు ధణO ధణO పటుగతినార్చుచు పట్టుఁడు లగ్గలు పెటులు చూఁడఁడదే పెట పెట పెటల్ చ. గుట్టున నుండక కూలె రావణుఁడు పట్టుఁడు సంకులు భం భం భం యిట్టె శ్రీ వేంకటేశుఁడు గెలిచెను దిట్టలైయాడుఁడు ధింధింధిం రేకు: 0.179-05 బౌళి సంపుటము:02-396 పల్లవి: జలజనాభ హరి జయ జయ యిల మానేరము లెంచకువయ్యా చ. బహుముఖముల నీప్రపంచము సహజగుణOబుల చOచలము మహిమల నీ విది మరి దిగవిడువవు విహరణ జీవులు విడువఁగఁగలరా చ. పలునటనల యినాప్రకృతి యిది తెలియఁగఁ గడునింద్రియవశము కలిసి నీ వందే కాఁపురము మలినపు జీవులు మానఁగఁగలరా చ. యిరవుగ శ్రీవేంకటేశుఁడ నీమాయ మరలుచ నీవే సమరుఁడవు శరణనుటకే నే శక్తుఁడను పరు లెవ్వరైనాఁ బాపఁగఁగలరా రేకు:0224-01 దేసాక్షి సంపుటము: 03–132 పల్లవి: జాలి మోహినీగజము సంసారమిది లోలుఁడఁ గాకపోదు లోకము సహజము (?) చ. నేరమెల్లా జీవునిది నేరుపెల్లా దేవునిది దారదప్పి విఱ్ఱవీఁగఁ దనకేల కారణ మాతఁడు దాఁ గార్యమాత్ర మింతే శూరుఁడై రెంటాఁ జొరక చూచుటే సుఖము చ. ప్రకృతి కాతుమ దాను పరమాత్ముఁ డాతఁడు తకపికలై మరియఁ దనకేల సకలము నాతఁడు సత్తామాత్రము దాను వొకటీఁ గోరక వూరకుండుటే సుఖము చ. సేవించఁ దనకుఁ గద్దు శ్రీవేంకటేశుఁ డాతఁడు దావతిఁ గర్మపుఁబాటు తనకేల శ్రీవిభుఁ డాతఁడు దాను చేతన మాత్ర మింతే కేవల మాతనివాఁడై గెలుచుటే సుఖము