పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

553 రేకు:0252-05 గుండక్రియ సంపుటము: 03-300 పల్లవి: జయ జయ రామా సమరవిజయరామా భయహర నిజభక్తపారీణ రామా చ. జలధి బంధించిన సౌమిత్రిరామా సెలవిల్లు విరచిన సీతారామా అల సుగ్రీవు నేలిన అయోధ్యరామా కలిగి యజ్ఞము గాచే కౌసల్యరామా చ. అరి రావణాంతక ఆదిత్యకుల రామా గురుమానులనుఁ గాచే కోదండరామా ధర నహల్య పాలిటి దశరథరామా హరురాణి నుత్రుల లోకాభిరామా చ. అతి ప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణరామా వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా మతిలోనఁ బాయని మనువంశరామా రేకు: 0185-06 గుండక్రియ సంపుటము: 02-431 పల్లవి: జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి చ. శరణాగత్రపాలిజాత్రమూ పాణలి నసురలపాలి భూత్రమూ అరుదయన సృష్టికి నాదిమూలమా వోహరి నమో పరమపుటాలవాలమా చ. సకలదేవతాచక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి వికచముఖ నమో విధికి విధి చ. కొలచినవారల కొంగుపైఁడి ములిగినవారికి మొునవాఁడి కలిగిన శ్రీవేంకటరాయా మలసి దాసులమైన మాకు విధేయా రేకు: 0390-02 సాళంగనాట సంపుటము: 04-521 పల్లవి: జయము జయము ఇఁక జనులాల భయములు వాసెను బ్రదికితి మిపుడు చ. ఘన నరసింహుఁడు కOభమున వెడలె దను(జులు నమసిలి ధర వెలసె పొనిఁగె నధర్మము భూభారమడఁగె మునుల తపము లిమ్మల నీడేరె చ. గరిమతో విష్ణుఁడు గద్దెపై నిలిచె హిరణ్యకశిపుని నేపడఁచె అరసి ప్రపదుని నన్నిటా మన్నించె హరుఁడును బ్రహ్మయు నదె కొలిచేరు చ. అహోబలేశుఁడు సిరి నంకమున ధరించె బహుగతి శుభములు పాటిల్లె యుహపరము లోరెసఁగె నిందును నందును విహరించెను శ్రీవేంకటగిరిని