పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

552 రేకు:0170-04 బౌళి సంపుటము:02-342 పల్లవి: జపములుఁ దపములుసంధ్యాదివిధులకు నెపము నామీఁద నింతే నీకే సెలవు చ. ఫలము నినుఁ గోరని పంతమువాఁడాఁ గాను వలెననడుగ నెంతవాఁడను నేను చెలఁగి నీవు కర్మము సేయించఁగాఁ జేసేటివెలలేక తెచ్చుకొన్న వెట్టివాఁడ నేను చ. ఆస మానితిననేటి యహంకారి నేఁ గాను వాసికి నీతోఁ బెనఁగేవాఁడనా నేను వేసరకుండాఁ గట్లు విడిపించి యేలుకోఁగా దాసుఁడనై బదికేటి ధర్మపువాఁడ నేను చ. జ్ఞానినైతిననే గర్వాచారపువాఁడాఁ గాను కానక నీపై మోపుగట్ట నోపను ఆనుక శ్రీవేంకటేశ ఆతుమ నీవుండఁగాను మోనాన నీకు మొక్కేటి మునివాఁడ నేను పె.అ.రేకు:0007-06 సాళంగనాట సంపుటము: 15-043 పల్లవి: జపింయుంచయో సర్వజనులు యీ నామము తమ రసమునో పుణ్యాలకు రామనామము చ. శాంతికరము రామచంద్ర నామము బ్రాంతు లణఁచు రామభద్ర నామము వింతసుఖ మిచ్చు రఘువీర నామమూ, భూమి చింత దీర్చునదివో శ్రీరామనామము చ. కలిదోషహరము రాఘవనామము సర్వ ఫలదము సీతాపతి నామము కులక శోభనము కాకుర్థనామము అని రలమైన దిదివో రామనామము చ. గుమిత మైనది రఘుకులనామము అతి సుముఖము దశరథసుత నామము అమితమై శ్రీవేంకటాద్రి నాయకుఁడై రవిుంుంచె యూత్రని రామనామము రేకు:0160–03 సాళంగనాట సంపుటము: 02-289 పల్లవి: జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రపదవరద చ. మిహిరశశినయన మృగనరవేష బహిరంతస్సలపరిపూర్ణ అహినాయకసింహాసనరాజిత్ర బహుళగుణగుణ ప్రపదవరద చ. చటులపరాక్రమ సమఘనవిరహిత నిటలనేత్ర మౌనిప్రణుత కుటిలదైత్యతతికుక్షివిదారణ పటువజ్రనఖ ప్రపదవరద చ. శ్రీవనితాసంశ్రీత వామాంక భావజకోటిప్రతిమాన శ్రీవేంకటగిరిశిఖరనివాస పావనచరిత ప్రపదవరద