పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

551 రేకు:0259-03 సామంతం సంపుటము: 03-339 పల్లవి: జననమరణములు జంతురాసులకు వెనకముందరను విడువని కొరెలలు చ. తలఁచినచోటను తగుదేహములై పాలసిపోయినాఁ బోనీవు వెలుపల లోపల వెలయ భోగములు కలలోపలివలెఁ గన్నది తెలివి చ. పూచినచోటుల పుత్రమిత్రులై కా(చి కరఁచినాఁ గరఁగవివి తూ(చిన నిరుదెస దుఃఖుసుఖOబులు వూఁచి విడుచుటే వోపిన తెలివి చ. అనాది వాసనలOటిన జిగురులు మనోగుణములై మానవివి వినోదములు శ్రీవేంకటేశుకని కనే వుపాయము కందువ తెలవి పె.అ.రేకు: 0034-03 నాట సంపుటము: 15-191 పల్లవి: జనించె నిదిగో శ్రావణబహుళాష్టమిని ఘన చంద్రోదయవేళ కన్నులపండువగా చ. కాళింగుపాలిటి వైరి కంసుని నెత్తిపిడుగు చాలిన పూతన ప్రాణసంహారమూర్తి గాలి తృణావర్తునికి కాలయమదండము పేలరి మద్దులకును బిరుదుకుఠారము చ. శకటాసురుని దెత్తి బాణూరుని మెడగత్తి బకాసురునిఁ జెండేటి బలుఱంపము వికటధేనుకాసురు వెసఁ జంపే మెడతాడు మొకరికుక్కుటదైత్యు మోదేటి భూతము చ. గోపికల నిధానము గోకుల కల్పవృక్షము పాపరాని అక్రూరుని ఫలసారమూ యేపొద్దు శ్రీ వేంకటాద్రి నిరవై దాసుల కెల్ల చేపట్టు కుంచమైనట్టి చిన్మయానందము రేకు:0062-05 ముఖారి సంపుటము: 01-320 పల్లవి: జనులు నమరులును జయలిడఁగా ఘనుఁడదె వుయ్యాలగంభముకాడ చ. వదలక వలసినవారికి వరములు యెదురెదురై తానిచ్చుచును నిదురలేక పెనునిధినిధానమై కదలఁ డదే గరుడగంభముకాడ చ. కోలినవారికి కోరినవరములు వోరంత ప్రోద్దు నొసంగుచును చేరువయై కృపసేసీ నిదివో కూలిముల పడిమిగోపురమూడ చ. వడి వేంకటపతి వరములరాయఁడు నుడుగఁగాళ్ళు(గన్నులు సుతుల బడిబడి నొసంగుచు బ్రాణచారులకు కడిమి నీడ దిరుగని చింతాడ