పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

550 పె.అ.రేకు:0070-03 గుండక్రియ సంపుటము: 15-402 పల్లవి: జగమెల్లాఁ జూచితిని చనవరులై యున్నారు అగపడి యెవ్వరిఁ గా దనవచ్చును మాకును చ. అందరి భ్రమయించేది అదిగో నీ విష్ణుమాయ పొందుగా సృష్టి యెల్లా నీ పుత్రుఁడైన బ్రహ్మదే యెందును సంసారము సేయించేవాఁడు మన్మథుఁడు చెంది యెవ్వరిఁ గా దని చెప్పవచ్చు మాకును చ. సర్వము నీ యాజ్జయని సంకల్పము చెప్పేరు వుర్వినెత్తిఁ బెట్టుకొని వున్నాఁడు నీ శేషుఁడు పర్వినీ మహిమ విష్ణుపాద మట ఆకాశము నిర్వహించి యెవ్వరితో నెట్టు కొనే మిఁకను చ. జలధి పాన్పు రవిచంద్రులు కన్నులు నెలవు బ్రహ్మాండము నీ కింతా నటే యెలమి శ్రీవేంకటేశ యలమేల్మంగపతిని తలఁప నెవ్వరు నీ చిత్తము పట్టి రిఁకను రేకు:0096-05 శ్రీరాగం సంపుటము: 01-481 పల్లవి: జడమతిరహం కర్మజంతురేకోహం జడధినిలయాయ నమో సారసాక్షాయ చ. పరమపురుషాయ నిజభక్తిజననసులభాయ దులిత్రదూరాయు సింధరహిత్రాయు నరకాంతకాయ శ్రీనారాయణాయ తే మురపూరాయు నమో నమో నమో చ. నగసముద్ధరణాయ నందగోపసుతాయ జగదంతిరాత్మాయ సగుణాయ మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప– న్నగరాజశయనాయ నమో నమో చ. దేవదేవేశాయ దివ్యచరితాయ బహు భావనాతీతాయ పరమాయ శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ భూవల్లభాయ నమో పూర్ణకామాయ రేకు:0166-02 రామక్రియ సంపుటము: 02-318 పల్లవి: జతనము జతనము సర్వేశు నగరిది బతుకుఁదోవ యిదె బడకరము చ. హృదయములోపల నీశ్వరుఁడున్నాఁడు పదిలము మనసా బడకరము తుద నల కామాదులఁ జొర నియ్యక పదరక కావుము బడకరము చ. యెంచుకొనీనిదే యేలిక మిము నిఁక పంచభూతములాల బడకరము మించిన పురి తొమ్మిదివాకిళ్లను పంచుక వున్నారు బడకరము చ. నడుమ నడుమఁ బ్రాణములాలా మీరు బడి వాయకుండరో బడకరము యెడయక శ్రీవేంకటేశ్వరునకు మీరు బడలక కొలువరో బడకరము