పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

549 వెడఁగుఁదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో చ. చెలఁగి నిను నేఁ బూజించి చేతులూఁ దనియవు చెలువు సింగారంబు దలఁచి చిత్తమూఁ దనియదు అలరి శ్రీవేంకటగిరీశ్వర అత్మ నను మోహించఁజేసితి వెలయ నిన్నియుఁ దేరే మును నీవెలితో నావెలితో రేకు:0177-01 గుజ్జరి సంపుటము:02-381 పల్లవి: జగమంతా నీమయము సర్వం విష్ణుమయంబు గాన యెనయుచు నేఁగర్మమార్గముల నితరదేవతల భజియించెదను అని యపరాధం బెంచకుమీ అన్యము నీకంటె మరి లేదు పనివడి "మత్తఃపరతరం" బని పలికితి విన్నియు నీ యాజ్ఞలు చ. దేవ నావుదరపోషణకు తివిరి హింస చేసెదను నీ విది నావల నెంచకుమీ నీవే అఖండ చేతన్యుఁడవు దేవ మిము "నైతేన వినా తృణాగ్రమపి" యని శ్రుతి వొగడెడిని చ. భువిలో నాకట పూర్వకర్మమట పొఁగదునే నీసరణి నీయడను అవి నా కేమియుఁ బనిలేవు అంతరియామివి నీవు అవలను "త్వమేవ శరణం గతి" యనుటది నమ్మితి శ్రీవేంకటనిలయా రేకు: 0304-02 సాళంగనాట సంపుటము: 04-020 పల్లవి: జగములెల్లా నీడేరె జయ వెట్టి రిందరును తగ నేఁడు కృష్ణావతారమాయ నిదివో చ. అచ్చితుఁడు జనించె నద్దమరేతిరికాడ ముచ్చిమి రాకాసులు ముట్టుపడిరి పచ్చిగాను లోకులాల పండుగ సేయరో నేఁడు అచ్చపుఁ గృష్ణావతారమాయ నిదివో చ. గోవిందుఁడు జనియించె గోకులష్టమిదే నేఁడు కావరపు కంసుని గర్వమణఁగె భావించి ప్రజలాల పారణ సేయరో నేఁడు ఆవేళఁ గృష్ణావతారమాయ నిదివో చ. అనంతుఁడు శ్రీవేంకటాద్రీశుఁడు జనియించె ఘనశిశుపాలాదులు గతమైరి తనివంది జనులాల ధర్మాన బ్రతుకరో అనుగుఁ గృష్ణావతారమాయ నిదివో రేకు:0240-03 ముఖారి సంపుటము: 03-229 పల్లవి: జగములేలేవాఁడవు జనార్దనుఁడవు తగ నీవారమై(మే?) నేము ధర నెట్టుండినాను చ. గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు సతమై యన్నిటికిని సాక్షిని నీవు చతురత వలసితే జరతుము కొలుతుము తతి నేము సేసిన తప్పులు లోఁగొనవే చ. తల్లియుఁ దండ్రివి నీవు దాత దైవమవు నీవు యెల్ల వారికిఁ బరము నిహము నీవు మల్లడి నొక్కొకవేళ మఱతుము తలఁతుము చల్లఁగా మా నేరములు సైరించుకొనవే చ. దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు పరగ శ్రీవేంకటేశ పతివి నీవు విరివిగా నేమైనా వేఁడుదుము నుతింతుము శరణు చొచ్చితిమిఁక క్షమియించుకొనవే