పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

548 సిసువును సుతుఁడంటాఁ జెలఁగిరి నేఁడు చ. హరిమాయ కంసుమద మడఁచె నేఁడు పొరుగిరుగులవా రుప్పాంగిరి నేఁడు సిరి నలమేల్మంగతో శ్రీవేంకటేశుఁడై నిల్చె అరుదుగా గొల్లెతలు ఆడుకొనేరు నేఁడు చి.ఆ.రేకు:0008-05 లలిత సంపుటము: 10-047 పల్లవి: జగదీశ్వరుని లీలాచక్రములోపలనుండి మగుడ దాసుఁడుగాక మూయు దాఁట వసమూ చ. తనువు నాదెయనఁగ తనకు స్వతంత్రమేది తనువులో తాను హరి తను వెకాన మనసులో యీసుద్ది మరినమ్మితేఁ జాలు వెనకముందరలకు విచారమేలేదు చ. సామ్మలు నావియనఁగ సాధించఁ దానెవ్వఁడు సోమ్ములునుఁ దాను హరిసామ్ము లెకాన సమ్మతి నీతలఁపె సహజమై కలిగితే నెమ్మదిఁ దా నిన్నిటా నిశ్చింతుఁడౌను చ. బంటులు నావారనఁగఁ బరికించ నెవ్వఁడు బంటులును దాను హరిబంట్లేకాన నంటున శ్రీవెంకటనాధునిఁ గొలిచితేను కంటకములెల్లాఁ బాసి ఘనుఁడె తానౌను పె.అ.రేకు:0070-04 భూపాళం సంపుటము: 15-403 పల్లవి: జగన్నాథా నీ కొక్కనికి శరణు చొచ్చితిమి కావఁ గదే అగపడి మాలో నున్నాఁడ వనుచు నానతి యిచ్చెను మాగురుఁడు చ. కలదు వొకానొక యదృష్ట మందురు కనుగొనలే రెవ్వరును తొలుత జనించిన జన్మము లెంతురు తెలియ నశక్యములు యెలమిని స్వర్గము గలదట ముందర కెక్కడ నున్నదొ మిన్నులపై వెలుపల నిట్టి విశేషంబులు నే వెతకఁగ నా తరమా చ. పొదుగుకొన్న దిదే కర్మమె యందురు పొడచూపుట లే దెక్కడను యెదిటిది మాయాకల్పితమే యట యెట్లు గురుతుపడు మాకును కదిసి చరాచరములకు నెప్పుడును కాచుకొన్నది విధియని చెప్పేరు విదితములైనవి యొక్కడెక్కడని వెతకంగ నా తరమా చ. అనుభవించువాఁ డాత్మఁడే యందురు అణురూపం బని తలఁచఁగరాదు తనువు సాధనము సర్వంబున కట తగు లిదె కంటిమి దృష్టముగా ననయంబును శ్రీవేంకటేశ్వరా యలమేల్మంగ విభుఁడా నిన్నుఁ గొలిచితి నిన్నిటికీ నెలవుగా నీ మహి మెఱుఁగఁగ నాతరమా రేకు:0176-01 బౌళి సంపుటము:02-375 పల్లవి: జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు వెగటు నాసాకిదంబు ఇది నీవెలితో నావెలితో చ. యెన్నిమారులు సేవించినఁ గన్నులూ దనియవు విన్న నీకథామృతమున వీనులుఁ దనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయుఁ దవియదు విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో చ. కడఁగి నీప్రసాదమే కొని కాయమూఁ దనియదు బడిఁ బ్రదక్షిణములు సేసి పాదములు నివిఁ దనియవు నుడివి సాష్ట్రాంగంబు చేసి నుదురునూఁ దనియదు