పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

547 ననిచి యీ రెంటికిని నారాయణుఁడే కర్త కొనమొద లాతనిదే కొసరు మాకేల చ. భోగమూలమైనది యీ పొందైన సంసారము యోగమూలము విరతి కొక్కటైనది యీ గతి శ్రీవేంకటేశుఁ డెట్టు వలసినఁ జేసు బాగులుగా నీతని శ్రీపాదమే మా దిక్కు రేకు:0140–05 శ్రీరాగం సంపుటము: 02-176 పల్లవి: చొచ్చితి నీకు శరణు సుద్దు లిఁకనేఁటికి కచ్చుపెట్టెవ్వరివల్లాఁ గలిగేదేమీ చ. పుట్టుక మునుపెఱఁగ పుట్టుగు మీఁదెఱఁగను యిట్టెయప్పటి యెఱుకయేడ కెక్కీని పట్టె మదనుభూతము పరసిపోయను బుద్ధి వట్టి పెద్దతనాలను వచ్చేదేమీ చ. రానివి రప్పించఁగ నేరను వచ్చేవాఁప నేర తానకపు నాస్వతంత్ర మెందాఁకా వచ్చును అనుకున్నది ముదిమి అట్టె జారె శాంతము నేనెంత విఱ్ఱవీఁగినా నిండేదేమీ చ. యిప్పుడు నే నెవ్వఁడనో యొక్కడ నీ వున్నాఁడవో కప్పిన నావుపాయాలే కార్యమిచ్చీని నెప్పున శ్రీవేంకటేశ నీయెదుటఁబడ్డ పని తప్పక యీడేర్తు గాక తలపోసేదేమీ రేకు: 0349-01 గుండక్రియ సంపుటము: 04-285 పల్లవి: జగతి వైశాఖశుద్ధచతుర్దశి మందవార మగణితముగఁ గూడె నదె స్వాతియోగము చ. పక్కన నుక్కుఁగంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్యకసిపుఁ దొడికిపట్టి చక్కఁగాఁ గడపమీఁద సంధ్యాకాలమున వక్కలు సేసె నురవడి నరసింహుఁడు చ. పిప్పిగాఁగఁ జప్పరించి పేగులు జందేలు వేసి తొప్పఁదోఁగుచు నెత్తురు దోసిటఁ జల్లె రొప్పుచుఁ గోపముతోఁ గేరుచుఁ బకపకనవ్వి తప్పక చూచె వాని నుదగ్రనరసింహుఁడు చ. యెదుటఁ బ్రహ్లాదుఁ జూచి యిందిరం దొడపై నుంచె అదన నందరికి నభయమిచ్చె కదసి శ్రీవేంకటాద్రిగద్దెమీఁదఁ గూచుండె వెదచల్లెఁ గృపయోల్ల వీరనరసింహుఁడు రేకు: 0331-02 భల్లాటి సంపుటము: 04–179 పల్లవి: జగతిలో మనకెల్ల జయంతి నేఁడు పగటున నందరికి పండుగ నేఁడు చ. అదివో శ్రావణ బహుళాష్టమి నేఁడు పొదిగొన్న రోహిణి సంపూర్ణము నేఁడు కదిసి యద్దమరేత్రికాడ నేఁడు ఉదయించెఁ గృష్ణుఁడు చంద్రోదయాన నేఁడు చ. వసుదేవదేవకుల వరము నేఁడు పసగా ఫలియించె రేపల్లెలో నేఁడు కొసరి యశోదనందగోపుఁడు నేఁడు - యీ