పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

546 యీలీల మాఁడుపూరిలో యిటూడేవా చ. తగు విభాండకునితో దాఁగిలిముచ్చలాడితి అగడుగా బండివిరిచాటలాడిత్రి వొగి శ్రీవేంకటగిరి నుండి వచ్చి మాఁడుపూరనెగసెగసి గతుల కిటులాడేవా (?) రేకు:0284-04 శుద్ధవసంతం సంపుటము:03-485 పల్లవి: చేరి యశోదకు శిశు వితఁడు ధారుణి బ్రహ్మకు దండ్రియు నితఁడు చ. సాలసి చూచినను సూర్యచంద్రులను లలి వెదచల్లెడు లక్ష్మణుఁడు నిలిచిన నిలువున నిఖిలదేవతల కలిగించు సురలగనివో యితఁడు చ. మూటలాడినను మరి యజాండములు కోటులు వొడమేటి గుణ రాశి నీటగు నూర్పుల నిఖిలవేదములు చాటువ నూ రేటి సముద్ర మితఁడు చ. ముంగిటఁ బొలసిన మోహన మాత్మలఁ బొంగించే ఘనపురుషుఁడు సంగత్రి మూ వంటి శరణాగతులకు నంగము శ్రీవేంకటాధిపుఁ డితఁడు రేకు:0140–06 కన్నడగౌళసంపుటము: 02-177 పల్లవి: చేసిన నావిన్నపము చిత్తానఁ బెట్టుకొమ్మీ వేసరించి యిప్పుడే నే వేడుకొంటిఁ జుమ్మీ చ. ముందె నాపుణ్యఫలములు నీ కిచ్చితినంటి కందువఁ గోరనని సంకల్పించితిని యిందు మఱచి తప్పినా యిన్ని నీకె సెలవు నిందవేసి నన్ను నిఁక నేరము లెంచకుమీ చ. నిన్నేకాని యితరుల నేఁ గొలువనొల్ల నంటి వున్నతిఁ బరద్రవ్యా లొల్లనంటి అన్నిటా నేనే మఱి యప్పటిమాటే యంచు సన్నల నన్నందుకు నొచ్చమని దూరకుమీ చ. నానా వుపాయాల నాఁడే శరణంటి పూని నీసాకారమునేఁ బొడగంటిని నేను మత్తుఁడనై వున్నా నీవే తలఁచి తెలుపుకో కోనేటి శ్రీవేంకటేశ కొసరించుకోకుమీ రేకు:0217-02 వరాళి సంపుటము: 03-091 పల్లవి: చేసినట్టే సేసుఁ గాక చింత మాకేలా వాసీవంతూ నతనిదే వట్టి జాలి యేలా చ. కర్మమూలమైనవి యీ కాయపువర్తనలెల్లా ధర్మమూలమైనది యీ దైవికము మర్మమైన వాఁడొక్కఁడే మనసులోనున్న హరి నిర్మిత మాతనిదింతే నేర నేనెంతవాఁడ చ. ధనమూలమైనది యీ తగిన ప్రపంచమెల్ల తనువు మూలమైనది యీ తపసులెల్లా