పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

545 పుట్టగు గెలుచుట భువి నేమరుదు చ. శ్రీవేంకటేశ్వరుఁ జేరి భజించిన యేవేళ సాత్విక మేమరుదు భావించి యూతనిపై భక్తి నిలిపినను కైవశముగఁ దనుఁ గను టేమరుదు రేకు:0351-01 శ్రీరాగం సంపుటము:04-297 పల్లవి: చేరి కొల్వరో యాతఁడు శ్రీదేవుఁడు యీరీతి శ్రీవేంకటాద్రి నిరవైన దేవుఁడు చ. అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుఁడు చెలఁగి శంఖచక్రాలచేతి దేవుఁడు కలవరదహస్తముఁ గటిహస్తపు దేవుఁడు మలసీ శ్రీవత్సవనమాలికల దేవుఁడు చ. ఘనమకరకుండలకర్ణముల దేవుఁడు కనకపీతాంబర శృంగార దేవుఁడు ననిచి బ్రహ్మాదుల నాభిఁగన్నదేవుఁడు జనించెఁ బాదాల గంగ సంగతైన దేవుఁడు చ. కోటిమన్మథాకార సంకులమైన దేవుఁడు జూటపుఁగిరీటపు మించుల దేవుఁడు వాటపుసామ్మలతోడి వసుధాపతిదేవుఁడు యీటులేని శ్రీవేంకటేశుఁడైన దేవుఁడు పె.అ.రేకు:0023-04 నాట సంపుటము: 15-132 పల్లవి: చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు కోరి వరము లిచ్చు కొండవంటి సింహము చ. గద్దెమీఁదఁ గూరుచుండి కనకకసిపుఁ జెండీ గద్దరి ప్రహ్లాదునిపై కరుణనిండీ వొద్దనె మారుగొండల వువిదయుఁ దాను నుండీ తిద్దుకొనె మీసాలు దివ్యనారసింహుఁడు చ. భవనాశిదరి దొక్కి బ్రహ్మాదులలోన నిక్కి తివిరి ప్రతాపమున దిక్కుల కెక్కి రవళి నారదాదుల రంగుపాటలకుఁ జొక్కి చెవు లాలించీ నుతులు శ్రీనారసింహుఁడు చ. అదె కంబములోఁ బుట్టి ఆయుధాలు చేతఁ బట్టి వెదకి అహోబలాన వేడుకఁ ಬುಲ್ಗೆ కదిసి శ్రీ వేంకటాద్రికాంతలలో గుంపుగట్టి వెదచలు మహిమల వీరనారసింహుఁడు రేకు:0231-06 పాడి సంపుటము: 03–179 పల్లవి: చేరి యందెలమోతతో చెన్నకేశవా యీరీతి మాఁడుపూరిలో నిట్టాడేవా చ. మున్ను యశోద వద్దను ముదు గునిశాడితివి పన్ని రేపల్లె వీధులఁ బారాడితివి పిన్నవై గోపాలులతోఁ బిల్లదీపులాడితివి యెన్నిక మాఁడుపూరిలో యిటూడేవా చ. కాళింగు పడిగెలపై కడు నాట్యమాడితివి కేలి యమునలో రాసక్రీడలాడితి చేలలంటి గోపికల చెట్టాపట్టాలాడితివి