పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

544 దండి జగముల కెల్ల దైవ మీతఁడు చ. వేవేలు చేతులను వెస నాయుధాలు వట్టి చేవ మీరి ప్రతాపాన సిరులు మించి యీవల నహోబలాన నిరవై యున్నవాఁడు శ్రీ వేంకటాద్రి మీఁది సిద్ధమూర్తి యీతఁడు పె.అ.రేకు:0028–05 రామక్రియ సంపుటము: 15-163 పల్లవి: చేతులెత్తి మొక్కరో జీవకోట్లాల యిదె యూత్రలాత్రల నిండిరిదే నారదాదులు చ. దిక్కులు సాధించ హరి తిరుతే రెక్కఁగాను యిక్కడ రతికెక్కిరి యింద్రాదులు వెక్కసపు శార్ణము వెస చేతఁ బట్టఁ గాను పక్కున గుండె వట్టిరి బ్రహ్మాదులు చ. యెడమచేత శంఖ మెత్తినప్పుడు వేదము కడఁగి మొదలెత్తిరి గౌతమాదులు కుడిచేతి చక్రము గక్కున మెఱిపంచంగాను సుడిసియు మెఱసేరు సూర్యచంద్రాదులు చ. లలి శ్రీ వేంకటేశుఁ డలమేలుమంగయుఁ బెండ్లి నలరంగ నమలిలి అమరాదులు వెలయ నితఁ డింతట విశ్వరూపము చూపఁగ సలిగం బొడచూపిలి సనకాదులు రేకు:0197-01 శంకరాభరణం సంపుటము: 02-496 పల్లవి: చేపట్టి మమ్ముఁ గావు శ్రీనరసింహా నీ శ్రీపాదములే దిక్కు శ్రీనరసింహా చ. చెలఁగు వేయిచేతుల శ్రీనరసింహా చిలకేటి నగవుల శ్రీనరసింహా సిలుగులేని మంచి శ్రీనరసింహా నీ– చెలిఁ దొడెక్కించుకొన్న శ్రీనరసింహా చ. క్షీరసముద్రమువంటి శ్రీనరసింహా దైత్యుఁ జీరిన వజ్రపుగోళ్ల శ్రీనరసింహా చేరి ప్రహ్లాదునిమెచ్చే శ్రీనరసింహా నుతించేరు దేవతలు నిన్ను శ్రీనరసింహా చ. శ్రీవనితతో మెలపు(గు?) శ్రీనరసింహా చేవదేరే నీమహిమ శ్రీనరసింహా శ్రీవేంకటాద్రిమీఁది శ్రీనరసింహా సర్వజీవదయాపరుఁడవో శ్రీనరసింహా రేకు: 0330-03 కురంజి సంపుటము:04-174 పల్లవి: చేపట్టుం గుంచము శ్రీవిభుఁడు వై పెరిఁగి పొగడవలెఁ గాక చ. మనసులోనిహరి మరవక తలఁచిన యెనయ నిహపరము లేమరుదు పెనగొన నాతనిపేరు నుడిగినను తనకు మహానందము లేమరుదు చ. పుట్టించినాతని పొసఁగఁగ గొలిచిన యిట్టె వివేకం బేమరుదు చుట్టి యతనిదాసులకు మొక్కినను