పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

543 కదిసిన నియ్యాజ్ఞాకైంకర్యములే చ. నలుగడ మించిన నాజన్మాదులు పలుమరు లిటు నీపంపు లివి యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విఁక వలసినప్పుడీ వరములు నాకు రేకు:0298-02 సాళంగనాట సంపుటము: 03–567 పల్లవి: చేకొని కొలువరో శ్రీనరసింహము శ్రీకరమగు నిదె శ్రీనరసింహము చ. వెడలేటి వూర్పుల వేడిమి చల్లీ చిడుముడి కోపపు శ్రీనరసింహము గడగడ వడఁకేటి గండస్థలములు జెడలు గదలిచీ శ్రీనరసింహము చ. వంకరగోళ్ల వైపులు వెదకీ చింకచూపులను శ్రీనరసింహము హుంకారంబుల నుదధులు గలఁచీనంకెల శ్రీపతియగు నర సింహము చ. వదనము దిప్పచు వడి నసురమేను చిద్రుపలు చేసెను శ్రీనరసింహము అదివో శ్రీవేంకటాద్రి యొక్కి యిటు చెదరక నిలిచెను శ్రీనరసింహము రేకు:0212-03 శుద్ధవసంతం సంపుటము:03-069 పల్లవి: చేకొనువారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే యే కడఁ జూచిన యితరము లేదు చ. తలఁపులోన నంతర్యామిదివో తెలిసి చూచితే బ్రిష్టంబు చలమునఁ దన మతి సందేహించిన కలఁగి మూఁడులోకంబుల లేఁడు చ. వెసఁ గను దెఱచిన విశ్వాత్మకుఁడిదె దెసల నింతటా బ్రిష్టంబు పసిగొని తనుఁ బాపములు భ్రమించిన కసరి సృష్టి చీఁకటిపడునపుడే చ. చేరి కొలిచితే శ్రీవేంకటపతి సారె బ్రతుకునకు శాసనము పైరగు తనలో భక్తి వదిలితే కూలిమి తెర మఱఁగునకును మఱఁగు రేకు: 0380–03 శుద్ధవసంతం సంపుటము:04-466 పల్లవి: చేకొన్న భక్తుల పాలి చింతామణి సాకారమై వున్నాఁడు సర్వేశ్వరుడు చ. వాఁడిగోళ్లచేత వడి హిరణ్యునిఁ జంపి వేడుక నెత్తురు లెల్ల వెదచల్లుచు పోఁడిమి నరసింహుఁడై పొడచూపె నల్లవాఁడె మూఁడు మూర్తులకును మూల మీతఁడు చ. కొండమీఁదఁ గూచుండి కోప ముపసంహరించి అండనున్నదేవతల కభయమిచ్చి మెండుగ సులభుఁడై మెరయుచు నున్నవాఁడు