పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

542 వున్నతంబైన నాదమొప్పిదమయోఁ గాదో చ. మనసారని నామతోడి మంత్రముకంటెఁ బెద్దలెల్లా మునుప నాచార్యుఁడే ముఖ్యమందురు వొనరి శ్రీవేంకటేశ వుర్వి నిక్షేపముకంటె కనిపంచే యంజనమే వెగ్గలమౌఁగాదో పె.అ.రేకు:0033-05 శుద్ధవసంతం సంపుటము: 15-188 పల్లవి: చెల్లుబడీ కల్లలటచేత లివి నీవియట బల్లిదుఁడ హరి మమ్ము భ్రమ దెలుపవయ్యా చ. వొకసస్యమునఁ బంట వొకకోటి కొండ లట వొకపశువునందు పాలూరేదట ఆకట కొందరవి అంతలో చవిగొనిన సకలంబు దీరు నట నటకు నిజ మేదీ చ. అన్నంబు గొనెడిదట యప్పటి నాఁకలి యట తిన్ననై కొంతదడవు తృప్తి నటా కన్నులనే నిద్ర లట కడఁగి మేల్కనుట యట యిన్ని బొంకుల జగము యెట్ల నమ్మెడిది చ. కాయమట ప్రాయమట కాంతలట పురుషులట రాయడింపులె ముతికి రతిసుఖ మటా యేయోడల శ్రీవేంకటేశ నీ మాయలివి పాయునట నీ దాసపరికరములకును రేకు: 0370–04 సామంతం సంపుటము: 04-413 పల్లవి: చెల్లె నీచేఁతలు నీకే చేరి మేడెగుడిదిన్న నల్లదె కంటిమి నిన్ను హనుమంతురాయ చ. జంగ చాఁచినట్టి నీ సంగడి పాదములు చెంగలించి యెత్తిన నీ శ్రీహస్తము ముంగలిఁ బిడికిలించి మొలఁజేర్చినచేయి అంగమాయ నీ సాంబగు హనుమంతరాయ చ. పెరిగినవాలము ಸುದ್ದಿನಿ పిరు(దును అరిగి జలధి దాఁటే యాయితమును సిరుల బంగారు కాసె చెలఁగిన సింగారము అరుదాయ నీవునికి హనుమంతరాయ చ. స్వామి కార్యపుఁ జింత జానికి సేమపువార్త దీమసాన మగుడి యేతెంచిన చేఁత రామ నామ జపముతో రతి శ్రీ వేంకటపతికా మేటి బంటవైతివి హనుమంతరాయ రేకు:0200–04 సాళంగం సంపుటము: 02-517 పల్లవి: చేకొంటి నిహమే చేరిన పరమని కైకొని నీవిందు కలవే కాన చ. జగమునఁ గలిగిన సకల భోగములు తగిన నీప్రసాదములే యివి అడపడు నేఁబదియక్షరపంజ్కలు నిగమగోచరపు నీమంత్రములే చ. పాందిగొని సంసారపుత్రదార లిల వదలని నీదాసవర్గములే చెదరక యేపొద్దుఁ జేయు నాపనులు