పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

541 బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల చ. ఊపిరిలో దేవుఁడున్నాఁడు యోగీంద్రులకు దాపున నున్నాఁడు హరిదాసులకును యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక చాపలాన వెదకేరు సకలదేవతల పె.అ.రేకు:0063-01 దీపకం సంపుటము: 15-358 పల్లవి: చెల్లఁబో యేమి చెప్పేది జీవుని యజ్ఞానము తెల్లమైన పనులెల్లా దెలిసీఁ దెలియఁడు చ. అప్పిచ్చి వడ్డిలాభాన కా దినము లెంచుఁ గాని కప్పి సరివచ్చే గతకాల మెంచఁడు యెప్పుడు నింతులఁ గూడి యింపులే తలఁచుఁ గాని చిప్పిలి దేహము సమసేది దలఁచఁడు చ. పంతముతో వేఁటలాడి ప్రతాపమే చూచుఁ గాని బంతినే చుట్టుకొనే పాపము చూడఁడు వింతవారి సొమ్ము వేడుక వూహించుఁ గాని వOత్రలC దిరుగ దిద్దవలయు టూహించcడు చ. అన్నిటాఁ గర్తననే యహంకార మెఱుఁగు గాని తన్నుఁ బ్రేరించే దైవము తా నెఱుఁగఁడు యెన్నఁగ శ్రీవేంకటేశ యివి యెల్లా నీమాయలే మన్నించి బుద్ధి యొసంగి మనుప నీ భారము రేకు: 0030-01 ఆహిరి సంపుటము: 01-182 పల్లవి: చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి - పుల్ల మేరువు సేయ భూమిలో నిపుడు చ. చెలఁగి నే మును సేసినచేత లుండఁగా మలసి నేఁ దిరుగుతిమ్మట లుండఁగా తొలఁగఁదోసి తప్పుడుతోడనే లోహంబు వెలయు బంగారుగావించినగలిని చ. బిగిసి నామైనున్న పెనుకటుండఁగా జగడగాండు పగచాటఁగను జిగిగలచేఁతిముసిఁడికాయయగునన్ను మొగిఁ గల్పకము ఫలముగఁ జేయవసమా చ. పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగా మదివికారము నే మరుగఁగానే వదలకు వేంకటేశ్వర నన్ను నిదే నీ - పదపంకజములు చేర్పఁగ నిది వసమా పె.అ.రేకు:0060–02 నాట సంపుటము: 15-341 పల్లవి: చెల్లునయ్యా యీ మాట శ్రీహరి యెల్లవారికి నిది విన నింపాఁ గాదో చ. చేచేత నిన్ను ధ్యానము సేయు కంటెఁ బెద్ద లెల్లా యేచి నీ గుణానుభవమే యొక్కుడందురు పూచిన శాఖలతోడఁ బొదలు వృక్షము కంటెను కాచి పండిన ఫలము ఘనమూఁ గాదో చ. యిన్నిటాను నీకంటేను యెంచి చూచి పెద్ద లెల్లా చెన్నుగాని దాసులె విశేష మందురు మిన్నక వనములలో మెఱయుఁ గోవిలకంటెను