పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

536 చుట్టుకొన్న వెంట్రుకల జూబులకొప్పవాఁడ లెట్టి మా యిల్లువరు వెదక నేమిటికి చ. నానుచున్న నోరిలోని నరాల నాలికవాఁడ యే నిజమూ నెఱుఁగని యెడ్డవాఁడనూ లోనుండి శ్రీవేంకటాద్రి లోకేశుఁడు నన్ను నేలె తానకపు మా గుట్టు తలఁచ నేమిటికి రేకు:0229-05 సామంతం సంపుటము: 03–166 పల్లవి: చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితఁడు కప్పి కన్నుల పండుగగాఁ జూడరో చ. అద్దుచుఁ గప్పరధూళి యట్టే మేన నలఁదఁగా వొద్దిక దేవునిభావ మూహించితేను మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి మద్దులకాంతి మేన మలసినటుండె చ. అమరఁ దట్టపుణుఁగు అవధరించఁగాను తమితోఁ బోలికెలెల్లఁ దచ్చిచూడఁగా యమునానది నాఁగేట నండకుఁ దీసుకొనఁగా యమునానది నలుపు అంటిన యట్టుండె చ. అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను సింగారించి సామ్మలెల్లఁ జెలరేఁగఁగా బంగారపుటలమేలుమంగ నురాన నుంచఁగా బంగారము మేననెల్లాఁ బరగినట్టుండె పె.అ.రేకు:0043-06 శ్రీరాగం సంపుటము: 15-245 పల్లవి: చెప్పరానిమహిమల శ్రీధరా నీవు చెప్పినట్టు చేసేము శ్రీధరా చ. చేరఁ దీని నా కన్నుల శ్రీధరా నీ జీరల మేను చూచితి శ్రీధరా చేరువ సంతోష మబ్బె శ్రీధరా చీరుమూరాడీఁదమి శ్రీధరా చ. చెల్లు నన్నియును నీకు శ్రీధరా నీ చిల్లరసతులు వారే శ్రీధరా చెల్లఁబో ఆసుద్ది విని శ్రీధరా నాకు చిల్లులాయె వీనులెల్లా శ్రీధరా చ. సేవలు సేసేము నీకు శ్రీధరా మమ్ముఁ జేవదేరఁ గూడితివి శ్రీధరా చేవల్లకు రావోయి శ్రీధరా శ్రీవేంకటాద్రిమీఁది శ్రీధరా రేకు:0167-06 భూపాళం సంపుటము: 02-327 పల్లవి: చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు యెప్పడును జింతించేనిదే పనై నేను చ. పొలసి నీరూప మెట్టు పొడచూపేవో యెలమి నాభాగ్య మిఁక నెట్టున్నదో అలరి నా కేబుద్ధి ఆనతిచ్చేవో కలిగిన నీమూయ యేగతిఁ గడచేనో చ. వరుస నా కెట్టాఁ గైవసమయ్యేనో యిరవై నాజన్మఫల మెట్టున్నదో