పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

537 పరగ నామతి నెట్టు పాయకుండేవో కరుణానిధివి నిన్నే కరణి మెప్పించేనో చ. పనివడి యెట్టా నీభక్తి యిచ్చేవో నామనసు చంచల మెట్టు మట్టుపడీనో యెనలేని నాతలఁపు యెఱిఁగి శ్రీవేంకటేశ నను నేలితివి యెట్టా నాకోరిక చెల్లీనో రేకు: 0382–02 మాళవి సంపుటము: 04-477 పల్లవి: చెప్పితే నాశ్చర్యము సేసినచేత లితఁడు ముప్పిరి మనుజ వేషమునఁ బుట్టె నీతఁడు చ. రాముఁడుదయించె దశరథునికిఁ దమ్ములతో గామిడైన తాటకిని ఖండించెను ఆముక యజ్ఞము గాచె హరుని విల్లు విరిచె ప్రేమమున సీతాదేవిఁ బెండ్లి యాడెను చ. మడియించె ఖరునిని మారీచుని వధియించె కెడపె వాలిని యా సుగ్రీవునిఁ బెంచె జడధి బంధించెను సరుగ రావణుఁగొట్టె బడినే విభీషణునిఁ బట్టము గట్టెను చ. సీతాదేవితో నయోధ్య సింహాసనంబెక్కె పాశీతరించి కుశలవపుత్రు లఁగాంచె శ్రీ తరుణితో(గూడ శ్రీ వేంకటేశుఁడై నిల్చె కౌతుకమున జగము కరుణఁగాఁచెను రేకు: 0165-01 శ్రీరాగం సంపుటము:02-312 పల్లవి: చెప్పితేఁ బాసునందురు చేసిన దోసములెల్లా వొప్పగొని మన్నించ నుచితమౌ నీకు చ. క్షమియించుకొనవే సర్వాపరాధములు క్రమ మొఱఁగ కేమేమి గావించితినో రమణతో సర్వలోకరక్షకుఁడవట నీవు తమితోడ నన్నుఁ గావఁ దగవెను నీకు చ. పరిహరించఁగదవే బహునరకబాధలు గరిమల నెటువలెఁ గాచుకున్నవో అరుదుగా సురల మొరాలించితివట తొల్లి ధర నన్ను వహించుకోఁ దగవెను నీకు చ. వెనుకొని యుడ్డము రావే శ్రీవేంకటేశ్వర అనుభవించే కర్మము లవేమున్నవో పనివడి భక్తపరిపాలకుఁడవట నీకు తనుభోగాలు భోగించఁ దగవెను నీవు రేకు:0085-02 ముఖారి సంపుటము: 01-412 పల్లవి: చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే అప్పటి నపరాధమా ఆదరించవలదా చ. నియ్యాజ్ఞ దేహము నే మోఁచితి నింతే యియ్యోడ విజ్ఞానమేల యియ్యవయ్యా వెయ్యవేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితి వొయయ్య కొంతైనా వూరడించవలదా చ. నీవు సేసే కర్మము నేఁ జేయువాఁడ నింతే యీవల నానందసుఖ మియ్యవయ్యా