పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

529 విసువక వీరివారి వేసరించవచ్చునా చ. యెమ్మెల బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁగాక కమ్మి హరిదాసుఁడు గావచ్చునా నెమ్మది శ్రీవేంకటేశ నీచిత్తమే కాక దొమ్మలకర్మము లివి తోయవచ్చునా రేకు:0120-01 శంకరాభరణం సంపుటము: 02-115 పల్లవి: చీచీ వో జీవుఁడా చింతించుకో జీవుఁడా ఆచందాన కీచందము అరుహమా జీవుఁడా చ. వుత్తముఁడయిన హరి వుండేటి యాతుమలోన తత్తరపుఁ గాంతలను తలపోసేదా వొత్తి నారాయణనామ ముచ్చరించే నోరను రుత్త యధరపుఁదోలు రుచిగొనేదా చ. పొందుగాఁ గోవిందునిఁ బూజించేటి చేతులను సందడిఁ జన్నులమీఁద జాఁచబొయ్యేదా కందువ దేవునిరూపు కనుఁగొనే చూపులు ముందరి మర్మపుటంగములమీఁదఁ బెట్టేదా చ. వేవేలు విషుకథలు వినియేటి చెవులను ఆవటించి యాడసుద్దులాలకించేదా శ్రీవేంకటేశ్వరుని సేవించే యీజీవనము భావించక విషయాల పాలు సేసేదా రేకు:0094-03 బౌళి సంపుటము: 01-467 పల్లవి: చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా వాచవికి బతిమూలి వడఁ బడ్డబదుకా చ. ఆసలకుఁ జోటు గడు అంతరంగాన నెంతైన వీసమంతాఁ జోటు లేదు విరతికీని యీసున సంసారమున కెందరైనాఁ గలరు వోసరించి మోక్షమియ్య నొకరు లేరు చ. భోగించ వేళ గద్దు పొద్దువొడపుఁగుంకును వేగమే హరిఁదలచ వేళలేదు వోగులలంపటమున కోపి కెంతైనాఁ గదు యోగపుసత్కర్మాన కొకయింత లేదు చ. యెదుట ప్రపంచాన కెఱు కెంతైనాఁ గద్దు యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు మది శ్రీవేంకటేశుఁడు మమ్ము నిట్టె కాచెఁగాని ఎదరి నానేరములు పాప మఱి లేరు రేకు: 0181-01 తెలుగు కాంబోది సంపుటము:02-403 పల్లవి: చూచి మోహించకుందురా సురలైన నరులైన తాచి నీవు ముందరం బ్రత్యక్షమైనను చ. భాగీరథి పుట్టిన పాదపద్మములు భోగపు మరుని జన్మభూమి నీ తొడలు యోగపు నవబ్రహ్మలుండిన నీ నాభి సాగరకన్యక లక్షిసతమైన వురము చ. అందరి రక్షించేటి అభయహస్తము కంద నసురులఁ జంపే గదాహస్తము సందడి లోకముల యాజ్ఞాచక్రహస్తము l_rb -- 'ت'