పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

528 యెగువ నే మింతకంటే యొక్కుడు సేసేమా చ. పెక్కుమతములు చూచి బెండుపడ్డవారు లేరా పక్కన నన్నివిద్యలాఁ బరగినవారు లేరా వోక్కఁడే శ్రీవేంకటేశుఁ డుల్లములో నుండఁగాను యొక్కుడితనిఁ గొలువ కెవ్వరిఁ బోలేము రేకు:0103-01 శుద్ధవసంతం సంపుటము:02-013 పల్లవి: చీ చీ వివేకమా చిత్తపు వికారమా యేచి హరిఁ గొలువక హీనుఁడాయ జీవుఁడు చ. బతికేనంటాఁ బోయి పయిఁడి వుచ్చుక తన పతి యవసరములఁ బ్రాణమిచ్చీని బతు కందులోన నేది పసిఁడి యొక్కడ నుండు గతి హరిఁ గొలువక కట్టువడె జీవుఁడు చ. దొడ్డవాఁడనయ్యేనని దొరలఁ గొలిచి వారి కడ్డము నిడుపు మొక్కునతిదీనుఁడై దొడ్డతన మేది యందు దొర యాడనున్నవాఁడు వొడ్డి హరిఁ గొలువక వోడుపడె జీవుఁడు చ. చావనేల నోవనేల సారెఁ గిందుపడనేల యీవల శ్రీవేంకటేశుఁడింట నున్నాఁడు దేవుఁ డాతఁడే నేఁడు తెలిసి కొలిచేఁ గాని భావించ కిన్నాళ్ళదాఁకా భ్రమఁబడె జీవుఁడు పె.అ.రేకు:0015-06 ముఖారి సంపుటము: 15-086 పల్లవి: చీచీ నరుల దేఁటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతు గాకా చ. అడవిలో మృగజాతియైనాఁ గావచ్చుఁ గాక వడి నితరులఁ గొలువఁగ వచ్చునా వుడివోని పక్షియె వుండనైనా వచ్చుఁ గాక విడువ కెవ్వరినైనా వెఁడవచ్చునా చ. పసరమై వెతలేని పాటువడవచ్చు గాక కసటు వొనరులఁ బొగడవచ్చునా వుసురు మానై పుట్టివుండనైనావచ్చుఁ గాక దెసల నెక్కడనైనాఁ దిరుగవచ్చునా చ. యెమ్మెల పుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక కమ్మి హరి దాసుఁడు గావచ్చునా నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమె కాని దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా రేకు:0082-05 శంకరాభరణం సంపుటము: 01-397 పల్లవి: చీచీ నరుల దేటిజీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక చ. అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁగాక వడి నితరులఁ గొలువఁగవచ్చునా వుడివోని పక్షియె వుండనై నావచ్చుఁ గాక విడువ కెవ్వరినైనా వేఁడవచ్చునా చ. పసురమై వెదలేనిపాటు వడవచ్చుఁ గాక కసివో నొరుల బొగడగావచ్చునా వుసురుమానై పుట్టివుండనై నవచ్చుగాక