పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

527 పెక్కులుగాఁ బిలువకున్నాఁ బిలిచినవాఁడనే చ. వోజ నారుగములాల నున్నాఁడవు గనక పూజించకున్నా నిన్నుఁ బూజించినవాఁడనే తేజపు శ్రీవేంకటేశ దేవ నీవే గతిగాన సాజాన నే మఱచినా శరణన్న వాఁడనే చి.ఆ.రేకు:0006–02 గౌళ సంపుటము: 10-032 పల్లవి: చిన్నవాఁడు నాలుగుచేతులతో నున్నాఁడు కన్నప్పుడె శంఖముఁ జక్రముఁ జేత నున్నది చ. నడురేయి రోహిణినక్షత్రమునఁ బుట్టె వడిఁ గృష్ణుఁడిదివో దేవతలందు పడిన మీబాధ లెల్ల ప్రజలాల యిప్పుడిట్టె విడుగరాయ మీరు వెరవకుఁ డిఁకను చ. పుట్టుతానె బాలుఁడు అబ్బురమైన మాటలెల్ల అట్టె వసుదేవుని కాన తిచ్చెను వట్టిజా లింకేల దేవతలాల మునులాల వెట్టివేములు మానెను వెరవకుఁ డిఁకను చ. శ్రీవెంకటనాథుఁడె యాసిసువు దా నైనాఁడు యీవల వరము లెల్లా నిచ్చుచును కావఁగ దిక్కెనాఁ డిక్కడనె వోదాసులాల వేవేగ వేడుకతోడ వెరవకుఁ డికను రేకు:0064-06 ముఖారి సంపుటము: 01-333 పల్లవి: చిరంతనుఁడు శ్రీవరుఁడు పరమం భవ్యం పావనం చ. వేదమయుఁడు కోవిదుఁడమలుఁడు పరుఁ డాది పురుషుఁడు మహామహుఁడు యేదెస నేమని యేది దలఁచిన నఖేద మవాద మఖిల సమ్మతం చ. నిఖ9లనిలయుఁడు ముని వరదుఁడథికుఁడు ముఖుముఖు శుకాఱముత్రరతుఁడు శిఖరం శివం సుశీలన మతిశయ ముఖరం ముఖ్యం మూలమిదం చ. అనేకప్రదుఁ డనాది నిధనుఁడు ఘనుఁడీ తిరువేంకటవిభుఁడు దినం దినం సముదిత రవికోటి భ జనO సిద్ధాంజనం ధనO రేకు:0196-04 లలిత సంపుటము:02-495 పల్లవి: చిరకాలధర్మములు చివుకు దవ్వఁగఁబోతే హరిమఱుఁగు చొచ్చితి మాతఁడే రక్షించెను చ. భువిఁ దొల్లి లేరా పుణ్యము సేసినవారు జవళిశాస్త్రములెల్లాఁ జదివినవారు లేరా దివి కెక్కి దేవతలై తేరినవారు లేరా యివల నే మివి సేసి యెవ్వరిఁ బోలేము చ. తగఁ దొల్లి వినమూ తపము సేసినవారి జిగి నన్నియజ్ఞములు సేసినవారి వినమా మిగులా సిద్ధివడసి మించినవారి వినమా