పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

526 రేకు:0050-06 బౌళి సంపుటము: 01-309 పల్లవి: చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో వొత్తిన యీచేఁత లొకరివి గావు చ. పదిలమైన మోహపాశంబులు దెచ్చి మెదలకుండఁగ నాకు మెడఁజుట్టి රැෆිඩවධි°රා ක්‍රො බටහීටහිර ඕවලීෆඩ් తుదలేని యాసల దు:ఖాతురునిఁ జేసె చ. కొలఁదిమీఱ జన్మకోట్లఁ బెనగొని తొలఁగని నాలోని దురితము తొలఁగింప నాలుక తుదకు నీపేరిచ్చి తెలుపు మింతియ చాలుఁ దిరువేంకటేశా రేకు 51 నుండి రేకు 60 గల 10 రేకులు లేవు. రేకు: 0381-03 సాళంగనాట సంపుటము: 04-472 పల్లవి: చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె హత్తి కానుక లిచ్చేరు అదె రాజరాజులు చ. రామ రఘు కుల వీర రాజీవ లోచన కోమల శ్యామల వర్ణ కొలువు వేళ వామ దేవాది మునులు వారె, సుగ్రీవుఁడు వాఁడె వేమారును వానర వీరులు మొక్కేరు చ. దేవ సీతాసమేత ధీర లోక నాయక భావించ నవధరించు పౌఁజువేళ పావని యల్లవాఁడె భలూకపతి వీఁడె సేవించీని భరతునిఁ జేకొను శత్రుఘ్నుని చ. శ్రీమదయోధ్యా విహార శ్రీ వేంకటనివాస సామజ వాజి రథాల సందడివేళ సౌమిత్రి యినావంక విభీషణుఁడు నావలి వంక నీ మహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు రేకు:0169-05 దేవగాంధారి సంపుటము:02-337 పల్లవి: చిత్తానఁ బెట్టకు మీమాఁట శ్రీరమణ మరవకు హత్తి నిన్నే మెరుఁగుదు నజ్ఞాని నేను చ. నెలకొని నాలోన నీవున్నాఁడవు గనక తలఁచకున్నా నిన్నుఁ దలఁచిన వాఁడనే యెలమి నందరి నీవే యేలినవాఁడవు గనక కొలువకున్నా నిన్నుఁ గొలిచినవాఁడనే చ. నెక్కొని ఆకసమెల్లా నీపాదమే కనక మొక్కకున్నా నేను నీకు మొక్కినవాఁడనే నిక్కి నానాక్షరములు నీపేరులే కనక