పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

525 చ. సిరి నెరగౌఁగిటి శ్రీనరసింహ మంచి సిరుల యహోబల శ్రీనరసింహ సిర నెత్తు శ్రీవేంకట శ్రీనారసింహ నీ నెర బడివారము శ్రీనారసింహా పె.అ.రేకు: 0033-02 లలిత సంపుటము: 15-185 పల్లవి: చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చ. బంగారుబొమ్మవంటి పణతి నీ యురముపై సింగారించిన నీకు శ్రీమంగళం రంగుమీఱఁ బీతాంబరము మొలఁ గట్టుకొని చెంగలించే హరి నీకు శ్రీమంగళం అంత నీలములవంటి వెలఁదిని పాదముల చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం చ. అరిది పచ్చలవంటియాకుల అంగననీ శిరసుపై నున్న నీకు శ్రీమంగళం గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదలతోడి సిరివర నీకు నిదె శ్రీమంగళం రేకు:0350–02 మధ్యమావతి సంపుటము:04-292 పల్లవి: చిత్తజగురుఁడ వో శ్రీ నరసింహా బత్తిసేసేరు మునులు పరికించవయ్యా చ. సకలదేవతలును జయవెట్టుచున్నారు చకితులై దానవులు సమసి రదె అకలంకయగు లక్షియటు నీ తొడపై నెక్కె ప్రకటమైన నీ కోపము మానవయ్యా చ. తుంబురునారదాదులు దొరకొని పాడేరు అంబుజాసనుఁ డభయమడిగీ నదె అంబరవీధి నాడేరు యచ్చరలందరుఁ గూడి శంబరరిపుజనక శాంతము చూపవయ్యా చ. హత్తి కొలిచే రదె యక్షులును గంధర్వులు చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా రేకు:0003–06 ముఖారి సంపుటము: 01-019 పల్లవి: చిత్తములో నిన్నుఁ జింతించనేరక మత్తుఁడఁనై పులుమానిసినైతి చ. అరుత లింగము గట్టి యది నమ్మఁజాలక పరువతమేఁగిన బత్తుడఁ నైతి సరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి చ. ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే వెడమతినై నే వెర్తుడ నైతి విడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండ పొడగానక మందబుద్ధి నేనైతి