పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

530 చెంది ధ్రువు నుతియించఁ జేయు శంఖహస్తము చ. సకల వేదములుండే చక్కని నీ మోము వొకటై తులసిదేవి వుండేటి శిరసు ప్రకటపు మహిమలఁ బాయని నీ రూపము వెకలి శ్రీవేంకటాద్రి విభుఁడ నీ భావము రేకు:0134-05 పాడి సంపుటము: 02-141 పల్లవి: చూచే చూపారెకటి సూటిగుఱి యొకటి తాచి రెండు నొకటైతే దైవమే సుండీ చ. యేనుగఁ దలఁచితే యేనుగై పొడచూపు మాను దలఁచిన నట్టే మానై పొడచూపు పూని పెద్దకొండ దలపాశీయఁ గొండై పొడచూపు తానే మనోగోచరుఁడు దైవమే సుండీ చ. బట్టబయలు దలఁచ బయలై పొడచూపు అట్టె యంబుధి దలఁచ నంబుధియై పొడచూపు పట్టణము దలఁచిన పట్టణమై పొడచూపు తట్టి మనోగోచరుఁడు దైవమే సుండీ చ. శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతి దలఁచితేను శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతై పొడచూపు భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ తావు మనోగోచరుఁడు దైవమే సుండీ పె.అ.రేకు:0059-06 నాట సంపుటము: 15-339 పల్లవి: చూచేవారికి ధర్మము సులభమువలె నుండు కాచి నమ్మి చేకొంటే ఘనువింగాఁ జేసును చ. అరియ శ్రీపాదతీర్థ మల్పమువలె నుండు వరుఁసఁ బాపములను వక్కలించును వొరసి నీ నామ మొక్క మాటవలె నుండును నరకములు తరించి నంటున రక్షించును చ. మహి నీ పూజ తులసీదళమాత్రమువలె నుండును యిహపరములు దానే యియ్య నోవును అహరహము నీ చింత ఆందోళమువలె నుండును విహితమై నీ కృపకు వెఁసఁ బాత్రుఁ జేసును చ. చేరి నీకు మొక్కే మొక్కులు చేష్టలువలె నుండు దారుణిలో భవవార్ధి దాఁటించును వూరకే నీ కిచ్చే కానుక వొక కాసువలె నుండును యీరీతి శ్రీవేంకటేశ యే వరమైనా నొసంగును పె.అ.రేకు:0050-06 కాంభోది సంపుటము: 15-286 పల్లవి: చూచేవారికిఁ గలిమి సుఖమే తోఁచుఁ గాని యేచి కావడి మోచేవాఁ డెఱుఁగునా వేఁగు చ. పక్కెరగుఱ్ఱముఁ గంటే పరులకే సింగారము గుక్కక దానికే మోపు గుడ్లకొలఁది కిక్కిటిసి యధికువాకిట నుండు సిరులెల్లా వెక్కసమై యానుకొన వేసటేను నాతనికి చ. గడా టాడేవానిఁ గంటే కన్నవారికి వేడుక అడుగడుగు ప్రయూస మటు వానికి బడినుండుఁ జతురంగబలములు దొరకును