పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

522 యేకొఱఁతని ఇఁక నాసపడుచు నేమెవ్వరికి నోళ్లు దెరచెదము చ. శ్రీవైకుంఠుని దాసులమట యరచేతిది మోక్షము మా కిదివో పావనగంగాజనకుని బంట్లము పాపములన్నిటఁ బాసితిమి శ్రీవేంకటపతి వరములియ్యఁగా జిక్కిన వెలుతులు మాకేవి యీ వైభవములఁ దనిసిన మాకును ఇతరులఁ దగిలెడిదిఁక నేది రేకు:0187-03 శ్రీరాగం సంపుటము:02-440 పల్లవి: చాలునిదే నావిరతి సకలసామ్రాజ్యము నాలోని పని యెంతైనా నాకుఁ గలదు చ. వడఁబడి పరులిండ్లవాకిలి గాచే నేను వడి నాలో హరియున్న వాకిలి గాచేను బడి నొకరిఁ గొలిచి బహురాజ్యమేలే నేను యెడ నామనోరాజ్యమింతా నేలేను చ. చేరి యొరులకుఁ బనిసేసి యలసే నేను సారె నాయోగాభ్యాసాన నలసేను అరసి నే నడుగఁగ నన్యులిచ్చేయినావులు తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని చ. అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల మందును మాయాకల్పిత మిందును మాయే అందు నిందు శ్రీవేంకటాధీశుఁడే కర్త అందైతేఁ బరతంత్రుఁడిందు నే స్వతంత్రుఁడ రేకు:0026–02 శ్రీరాగం సంపుటము: 01-157 పల్లవి: చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి వేవేలు దురితముల వేగించు టొండె చ. కనుఁగొనల నిరుమేను గాఁడిపారుట లొండె చను(గిరిOడలను మహచరులఁ బడు టిరెండె తనివని సురత్రములఁ దగిలి మునుఁగుట యొుండె ఘనమోహబంధములఁ గట్టువడు టొండె చ. మొనసి యూశాపాశములయురుల( బడు టిరెండె కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొుండె మనసు కాఁతాళమును మల్లువెనఁగుట లొండె పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె చ. తడసి మమతల నిరంతర దైన్యమది యొుండె నడుమనే కన్నుగానక తిరుగు టొండె యెడప కీతిరువేంకటేశుఁ దలంపఁగలేక పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె రేకు:0211-03 గౌళ సంపుటము: 03-063 పల్లవి: చింతలు రేఁచకు మమ్ము చిత్తమా నీవు పంతముతో మముఁగూడి బతుకుమీ నీవు చ. తల్లి శ్రీమహాలక్షితండ్రి వాసుదేవుఁడు ఇల్లు మాకు బ్రహ్మాండమింతా నిదె బల్లిదపు హరిభక్తి పాఁడీఁబంటా నాకు వొల్లము కర్మఫలము లొకటి నేము చ. జ్ఞానమే మాకు ధనము సర్వవేదములు సామ్మ వూనిన వైరాగ్యమే వుంబళి మాకు ఆనిన గురుసేవలు ఆఁడుబిడ్డలు నాకు మేనితోనే తగులాయు మేలు మాకుఁ జేరెను