పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

523 చ. యేలికె శ్రీవేంకటేశుఁడింటి దేవపూజ మాకు పాలు గల బంధువులు ప్రపన్నులు కీలు మాకు నీతని సంకీర్తన మోక్షమునకు యేలా ఇంకా మాకు నేమిటితో గొడవ రేకు: 0370-02 భూపాళం సంపుటము: 04-411 పల్లవి: చిక్కవద్దు చొక్కవద్దు సిలుగుఁ బ్రపంచముల తక్కిన భోగములెల్లా దైవమే యెరుఁగు చ. అంత్రరంగమునఁ దాను పూలిఁ దలCచినఁ జాలు అంతటి మీఁదటి పనులాత్రం డెరుగు పంతమున నాతనిపై భారము వేసినఁ జాలు వింత వుద్యోగములు గోవిందుఁడే యెరుఁగు చ. చేకొని యాతనిరూపు సేవించినఁ జాలు ఆకడి యీకడి కర్మాలాతఁ డెరుఁగు తేఁకువ నచ్యుతభక్తి తిరమయ్యినఁ జాలు దీకొని పరము చూప దేవుఁడే యెరుఁగు చ. సాధించి మాధవుని శరణుచొచ్చినఁ జాలు ఆదియు నంత్యములెల్లా నాతఁ డెరుఁగు పోదియై శ్రీ వేంకటేశుఁ బూజించినఁ జాలు పాదుకొని రక్షించఁ బరమాత్ముఁ డెరుఁగు రేకు:0111-03 శుద్ధవసంతం సంపుటము:02-063 పల్లవి: చిక్కువడ్డపనికిఁ జేసినదే చేత లెక్కలేని యప్పనకు లేమే కలిమి చ. తగవులేమి కెదిరిధనమే తనసామ్మ జగడగానికి విరసమే కూడు తెగుదెంపులేమికి దీనగతే దిక్కు బిగువుఁగూటికి వట్టిబీరమే తగవు చ. పతిలేనిభూమికి బలవంతుఁడే రాజు గతిలేనికూటికిఁ గన్నదే కూడు సత్రిలేనివానికి జరగినదే యాలు కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు చ. యెదురులేమికిఁ దమకేదైనఁ దలఁ పిది మదమత్తునకుఁ దనమఱుపే మాట తుదిపదమునకుఁ జేదోడైన(???) విభవము పదిలపు శ్రీవేంకటపతియే యెఱుక రేకు:0024-05 వరాళి సంపుటము: 01-147 పల్లవి: చిత్త మతిచంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుఁ డిటు దిరిగాడుఁ గాక చ. కదిసి జీవుఁడు పుట్టఁగాఁ బుట్టినటువంటి మొదలుఁ దుదయును లేని మోహపాశములు మదలు టెటువలెC దారు వదలించు టెటువలెను పదిలముగ వీనిచేఁ బడి పొరలుఁ గాక చ. కడలేని జన్మసంగ్రహములై యెన్నఁడును గడుగ వసములు గాని కర్మవంకములు విడుచు టెటువలెఁ దారు విడిపించు టెటువలెను విడువనివిలాపమున వేఁగుటలు గాక