పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

521 సతతము హరులో సగమై నిలిచె చ. చదువులుఁ బలుమరుఁ జదువనోపక అదివో నారదాదులు పదిలపువేంకటపతిహరినామమే వదల కిదియ జీవనమై మనిరి రేకు: 0337–02 నాగవరాళి సంపుటము: 04-215 పల్లవి: చాలుఁ జాలు నీసటలఁ బొరలితిమి వాలి కొంత వెరవకుమనలేవు చ. కలవు లోకముల ఘనమంత్రంబులు అలరి ముక్తి యియ్యఁగలేవు సులభానఁ గలరు సారిది దేవతలు వలగొను పాపము వారించలేరు చ. వున్నవి పుణ్యము లూరకె యివిగో పన్నిన హరిఁ జూపఁగలేవు సన్నితి నున్నవి సకళశాస్త్రములు కొన్నెన భవములకొన గన నీవు చ. ధరలో సేనలు ధనధాన్యంబులు పరమజ్ఞానవిభవ మిదు అరుదుగ శ్రీవేంకటాధిపుఁడే మము యిరవై కావఁగ యీడేరితిమి పె.అ.రేకు:0013-06 లలిత సంపుటము: 15-073 పల్లవి: చాలుఁ జాలుఁ దొలఁగవో జాలికోపమా సాశీలుచు హరిమఱుఁగు చొచ్చితినోకోపమా చ. నీననుఁ బరులు దిట్టితే నాకు వాసు లెక్కించి వెనకనే వత్తువుగా వెట్టికోపమా ధనము కొఱకుగాఁ దగవులఁ బెట్టి పెట్టి ఘనుల నెఱుఁగనీవుగా కోపమా చ. తనివి నవ్వుచు వచ్చి తల మొల విడఁగాను శివ మెత్తించితిగా ముంచిన కోపమా జవళిఁ జదివినట్టి సారవువిజ్ఞాని నైనా వివరము చెఱుతుగా వేఁదుఱు కోపమా ವಿ. ಬುಯ್ದಿಲು వినఁగనీక బూతుబండు గెలయించి పెద్దరికము చెరచే బేలు కోపమా అదో శ్రీవేంకటేశుఁ డాదరించి నన్ను నేలె వుద్దండాలు చెల్లవిఁక వుడుగవో కోపమా రేకు:0264-05 లలిత సంపుటము: 03–371 పల్లవి: చాలుఁజాలు నీ హరియే మాకును సకలక్రియలకు నాయకుఁడు నాలుక తుదనే యీతఁడుండఁగా నలుగడ నెవ్వరి వెదకేము చ. యేలినవాఁడట లక్షీవిభుఁడట యేమిటనుఁ గొరత మాకిఁకను నాలోనున్నాఁడు బ్రహ్మతండ్రియట నాకాయుష్యము బాఁతా పాలజలధిపై దేవుని వారము పాఁడి మాకు నిఁక నేమరుదు ఆలింపఁగ నేమింతటివారము అన్యులకిఁకఁ జేయి చాఁచేమా చ. భూకాంతాపతి కింకరులము యీ భూము లిన్నియును మాసామ్మే పైకొని చక్రాయుధుఁడే మాదాపు భయము లిన్నిటాఁ బాసితిమి యీకడ నచ్యుతుమరఁగు చొచ్చితిమి యెన్నటికిని నాశములేదు