పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

519 చ. కర్మియైనయమి వికృతకర్మియైననేమి దనకు కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా మర్మమెరిఁగి వేంకటేశుమహిమలనుచుఁ దెలిసినట్టి నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా రేకు: 9046-01 ఆహిరి సంపుటము: 04-558 పల్లవి: చాలదా నా సంసారము గాలియుయ్యెలలఁ దొలఁగక యూఁగవలసె చ. పాపపుణ్యములనెడి బల్లిదుల వెంటనే దీపించు బంటనై తిరిగి తిరిగి పైపైనె దేహంపుఁ బల్లెలొసఁగిన నరక కూపముల ముడి దున్నుకొని బ్రదుకవలసె చ. చిత్తమను విభుఁజేరి చెలఁగి విషయంబులకు కొత్తగమికాఁడనై కొలిచి కొలిచి హత్తుకొని మోహంబులను ప్రధానుల యెదుట గత్తంపు మొగసాలఁ గలదించవలసె చ. గాటంపు దురితములకై జీతగాఁడనై చేటైన కోరికలఁ జేరిచేరి ఈటాడఁ దిరు వేంకటేశుఁ గనకిన్నాళ్ళు కోటకొమ్మలకెగసి గుంపించవలసె రేకు: 0066-04 సామంతం సంపుటము: 01-343 పల్లవి: చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడఁగించు సంకీర్తనం చ. సంతోషకరమైన సంకీర్తనం సంతాపమణఁగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం చ. సామజముఁ గాంచినది సంకీర్తనం సామమున కెక్కుడీ సంకీర్తనం సామీప్యమిందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చ. జముబారి విడిపించు సంకీర్తనం సమబుద్ధి వొడమించు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదులఁ జేయు సంకీర్తనం చ. జలజాసనునినోరి సంకీర్తనం చలిగొండసుతదలఁచు సంకీర్తనం చలువ గడు నాలుకకు సంకీర్తనం చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం చ. సరవి సంపదలిచ్చు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరుస వేంకటవిభుని సంకీర్తనం సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం రేకు:0018-04 సామంతంసంపుటము: 01-110 పల్లవి: చాలదా మా జన్మము నీ పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగె