పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

518 చ. మాయ గొంత నిజమార్గమునుఁగొంత చాయ దప్ప దిదేసంసారము చేయిచ్చి వున్నాఁడు శ్రీవేంకటేశుఁడు యీయెడ నీరెండు నేకమే రేకు:0138-05 రామక్రియ సంపుటము: 02-164 పల్లవి: చాటెదనిదియే సత్యము సుండో చేటులేదీతని సేవించినను చ. హరినొల్లని వారసురలు సుండో సుర లీతని దాసులు సుండో పరమాత్ముఁడితఁడె ప్రాణము సుండో మరుగక మఱచిన మఱి లేదిఁకను చ. వేదరక్షకుఁడు విషుఁడు సుండో సోదించె శుకుఁడచ్చుగ సుండో ఆదిబ్రహ్మగన్నాడతఁడు సుండో యేదెస వెదికిన నితఁడే ఘనుఁడు చ. యిహపర మొసఁగను యీతఁడె సుండో వహి నుతించెఁ బార్వతి సుండో రహస్యమిదివో రహి శ్రీవేంక మహీధరంబున మనికై నిలిచె రేకు:0275-01 శంకరాభరణం సంపుటము: 03-430 పల్లవి: చానిపి లోపలఁ జవిగలదా! యివి మానిపి నీ గతి మరపుదుఁ గాకా చ. చంచలపు గుణముల జడిసిన జీవుఁడు మంచి గుణంబుల మలసీనా అంచెల హరి నీ వంతర్యామివి నించి నీ గుణమే నెరవుదుఁ గాకా చ. బూతుల యెంగిలిఁ బుట్టిన దేహము బాఁతిగ శుచియై పరగీనా చైతన్య మందులో శ్రీపతివి నీవు నీ తత్త్య ఫలమే నెరపుదుఁ గాకా చ. లలి సుఖదుఃఖప) లOకె కా(పురము మెలుపున సాజాన మెలఁగీనా యిలపై శ్రీవేంకటేశ్వర నీవిది కలిగించితి విఁకఁ గాత్రువుఁ గాకా రేకు:0048-04 భైరవి సంపుటము: 01-297 పల్లవి: చాల నొవ్వి నేయునట్టిజన్మమేమి మరణమేమి మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా చ. పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు కడపరానిబంధములకుఁ గారణంబులైనవి యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి చ. చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకు అలమిపట్టి దు:ఖములకు నప్పగించినట్టిది యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు ములుగ ములుగఁ దొలి తొలి మోఁదు టింత్ర చాలదా