పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

516 చ. ధర్మానఁ గొని తెచ్చిన దాసులకు వూర వెట్టి అర్మిలిఁ జేయఁగఁ బని అంతలేదు నిర్మల శ్రీవేంకటేశ నీ కరుణగల నాకు కర్మ లోపమైనాను కడమే లేదు రేకు:0022-02 ముఖారి సంపుటము: 01-132 పల్లవి: చలపాదిరోగ మీసంసారము నేఁడు బలువైనమందు విష్ణుభక్తి జీవులకు చ. కీడౌట మది నెఱింగియు మోహ మెడల దిది పాడైన విధికృతము బలవంతము యీడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగి జోడువో హరిఁ దలంచుట జీవులకును చ. హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మ పాయ దీరతిసుఖము బలవంతము మాయ నుగులు సేయ మాధవునిదంచనపురాయివో వైరాగ్యరచన జీవులకు చ. పాలయుదురితంపు రొంపులు దన్ను వడి ముంచ పలుమారుజన్మ మీబలవంతము నెలవుకొని సకలంబు నిర్మలముగాఁ గడుగుజలధివో వేంకటేశ్వరుఁడు జీవులకు చి.ఆ.రేకు:0005-04 గుజ్జరి సంపుటము: 10-028 పల్లవి: చలమె చెల్లించుకొన్న సతులాల సులభమూ మీతోపారెందు సుతులాల చ. ప్రతినైన యతినైన వలలమాటలఁ బెట్టి బతిమి చెరుతురుగా బంధువులాల హితవరులువలెనె యింత్ర నOత్ర నెలOుంచి తతిగొందురుగా ధనధాన్యములాల చ. పెద్దనైన పిన్ననైన పెలుచుఁదనమె రేఁచి కొద్దిమీరించిన కామక్రోధములాల అదో యెంతవిరక్త నైనా విషయాలకె తిద్దితిరిగా పంచేంద్రియములాల చ. మునినైన ఋషినైన మోహమె పెంచి మరపి మొనసితిరిగా యిలు ముంగిళ్లాల ఘనుఁడైన శ్రీవెంకటనాథుపాదములు చనవునఁ జూపతి రాచార్యులాలా రేకు: 0336–06 సామంతం సంపుటము: 04-213 పల్లవి: చలువకు వేఁడికి సరికి సరి కలదిఁక హరి నీ కరుణే మాకు చ. కాయము గలిగినఁ గలుగుఁ దోడనే పాయపు మదములు పైపైనే రోయదు తనుఁ గని రుచులే వెదకును యేయోడ హరి నిను నెరుఁగుట యెపుడో చ. కడుపు నిండితే ఘనమై నిండును బడిఁ బంచేంద్రియపదిలములు విడువ వాసులును వెలయు బOధములు కడగని మోక్షము గైకొనుటెపుడో