పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

515 చ. యేచిన పరహితమెంతయుఁ దమ దని వాచవులిన్ని నెవ్వగలని యీచందమున వేంకటేశుచేఁతలని చూచి లోభమువీడఁ జూడడాయఁగాని పె.అ.రేకు:0002-06 బేళి సంపుటము: 15-013 పల్లవి: చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు మదనాతురుఁడ నాకు మంచి తన మేది చ. ముట్ట యోగ్యము గానివి మోచితిఁదోలు నెమ్మలు అట్టె బ్రతికేననే ఆసలు బెట్టు జట్టిగాఁ బ్రాణము తీపు చావంటే వెలుతు నేను యిట్టి యజ్ఞానికి జ్ఞాన మెట్టు గలిగీని చ. కావలె ననుచుఁ గోరి కడుపు నించిన రుచి యీపల హేయమై వెళ్లీ యేఁ జూడగానే దావత్రి మనసందుకే తగిలీఁ గాని రోయుదు భావించి నన్నెంఱుఁగని భావ మెఱిఁగీనా చ. యోని గతుఁడనై పుట్టి యోనికి మగ్నుఁడనైతి పూని లోకబండఁ డనే బుద్దెఱిఁగీ నేనా యెంత సిగ్గేబుఁగ నీవే విచారించి కావు శ్రీనిధి శ్రీ వేంకటేశ చేతిలోని వాఁడను రేకు:0091-03 మాళవిగౌళ సంపుటము: 01-449 పల్లవి: చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాక మదముగప్పినమీద మగుడ నది గలదా చ. జడమతికి సహజమే సంసాయాతన యిది కడు నిందులోఁ బరము గడియించవలెఁగాక తొడరి గాలప్పడు తూర్పెత్తక తాను విడిచి మఱచిన వెనక వెదకితేఁ గలదా చ. భవబంధునకు విధిపాపపుణ్యపులంకె త్రివిరి యిందునే తెలివి తెలుసుకోవలెఁగాక అవల వెన్నెలోనె అల్లు నేరేళ్లింతే నివిరి నిన్నటివునికి నేఁటికిఁ గలదా చ. దేహధారికిఁ గలదే తెగనియుంద్రియబాధ సాహసంబున భక్తి సాధించవలెఁగాక యీహలను శ్రీవేంకటేశుదాసులవలన వూహించి గతిగానక వొదిఁగితేఁ గలదా రేకు:0280-04 సాళంగం సంపుటము: 03-462 పల్లవి: చరమార్ధమందు నీవు చాటితివి గాన ఇరవిది నమ్మితి నా కెదురెందు లేదు చ. పతికిఁ జనవరైన ప్రాణధారి లెంకలకు తతినేమి సేసినాను తప్పలేదు సతతము హరి నీ శరణాగతుఁడ నాకు (గాన?) అతిపాపము సేసిన అది నాకు లేదు చ. పారుచు నగరి డాగు పసుర మెవ్వరిచేని పైరు మేసినా నందు బందె లేదు సారె నీ ముద్రలు మోచి సంసారవిషయాల యేరీతిఁ బొరలినా ಯೆಗ್ಗೆ ෂීයා