పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

514 చ. శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు యీ నీ శరణంటే యిటు నీవే యెరిగింతు దైవమా నీ కల్పనలు తగ నీవే యెరుఁగుదువీవల నౌఁగాదన నితరుల వశమూ రేకు: 0306-03 దేసాళం సంపుటము:04-033 పల్లవి: చదివి బతుకరో సర్వ జనులు మీరు కదిసి నారాయణాష్ట్రాక్షర మిదియే చ. సాదించి మున్ను శుకుఁడు చదివినట్టి చదువు వేద వ్యాసులు చదివినచ దువు అది కాలపు వైష్ణవులందరి నోటి చదువు గాదిలి నారాయణాష్ట్రాక్షరమిదియే చ. సతతము మునులెల్ల చదివినట్టి చదువు వెత దీర బ్రహ్మచదివినచదువు జతనమై ప్రహ్లాదుఁడు చదివి నట్టి చదువు గతిగా నారాయణాష్ట్రాక్షర మిదియే చ. చలపట్టి దేవతలు చదివినట్టి చదువు వెలయ విప్టులు చదివేటి చదువు పలుమారు శ్రీ వేంకటపతినామమై భువిఁ గలుగు నారాయణాష్ట్రాక్షర మిదియే రేకు: 0313-02 శ్రీరాగం సంపుటము:04-074 పల్లవి: చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో చ. వొరుల దూషింతుఁగాని వొకమారైన నా దురితకర్మములను దూషించను పరుల నవ్వుదుఁగాని పలు యోని కూపముల నరకపు నామేను నవ్వుకోను చ. లోకులఁ గోపింతుఁగాని లోని కామాదులనేటి కాకలి శత్రులమీఁదఁ గడుఁ గోపించ ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుఁగాని తేకువ నాలోని హరిఁ దెలుసుకోలేను చ. యితరుల దుర్గణము లెంచి యెంచి రోతుఁగాని మతిలో నా యూసలు మానలేను గతిగా శ్రీవేంకటేశుఁ గని బ్రదికితిఁగాని తతి నిన్నాళ్లదాఁకా దలపాయ లేను రేకు: 0065–06 ధన్నాశి సంపుటము: 01-339 పల్లవి: చదివెఁబో ప్రాణి సకలము యీ చదువుమీఁది విద్య చదువఁడాయఁగాని చ. సిరులు చంచలమని చేఁతలధ్రువమని పరగుసంసారము బయలని తొరలిన సుఖమెల్ల దు:ఖమూలమని యెరిఁగి లోభమువీడ నెరఁగఁడాయఁగాని చ. తలకొన్న ధర్మమే తలమీఁది మోఁపని వలసీనొల్లమి దైవవశమని కలిమియు లేమియుఁ గడవఁగ రాదని తెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁగాని