పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

511 నీళ్ళతీగెలు నిగుడఁగ నోర నుచ్చిళ్ళు గమ్మఁగ నెట్లుండితివో చ. 5: హిరణ్యకశిపుని నేపడఁచి భయంకరరూపముతోఁ గడుమెరసి తిరువేంకటాగిరిదేవుఁడ నీవిఁక యిరపుకొన్ననాఁ డెట్లుందితివో రేకు:0268-01 లలిత సంపుటము: 03-389 పల్లవి: చంకగుదియ యిదే శరణార్తి నే నిదే తెంకి నా భావము దేవుఁడే యెరుఁగు చ. కోరెడి చిత్తము కోరక మానదు వైరాగ్యము నే వదలను యీరీతి దినములు యిట్లనే కడచీ తేరిన పను లిఁక దేవుఁడే యెరుఁగు చ. తగు సంసారము తనువునఁ బెనఁగీ వెగటై మోక్షము వెదకేను పగటున రెంటాఁ బరగిన జీవుఁడు తెగువలుఁ దగులమి దేవుఁడే యెరుఁగు చ. పంచేంద్రియములు పారీ నిక్కడ పెంచఁ బెద్దనై పెరిగేను అంచెల శ్రీవేంకటాధిపుఁ గొలిచితి దించని యీమాయ దేవుఁడే యెరుఁగు రేకు: 0159-01 పాడి సంపుటము:02-281 పల్లవి: చంచలపడఁగవద్దు సారె సారెఁ గోరవద్దు పొంచుకున్న దైవమే బుదులు నేర్పిరి చ. లోకరక్షకుఁడు నాలోననే వున్నాఁడిదే నాకు నభయములిచ్చి నన్నుఁ గాచును శ్రీకాంతుఁడీతఁడే నాచిత్తములో మలసీని దాకొని శుభములెల్లాఁ దానే వొసఁగును చ. పరమపురుషుడు నాప్రాణనాథుఁడైనాఁడు పరగ నాపాలివాఁడై బ్రదికించును ధరణీశుఁ డీతఁడే నాదాపుదండై కడఁగీని నిరతి నేపాదును మన్నించును మమ్మెపుడు చ. శ్రీవేంకటేశుఁడు నాజిహ్వఁ దగిలి వున్నాఁడు పావనునిఁ జేసి నాకు ఫల మిచ్చును గోవిందుఁ డీస్వామి నన్నుఁ గొలిపించుకొన్నవాఁడు యీవల నావల నాకు నిహపరా లిచ్చును చి.ఆ.రేకు:0003-03 గుజ్జరి సంపుటము: 10-015 పల్లవి: చంచలమతులకుఁ దెలియునే సాత్వికధర్మములు మంచమునీడవలె బహుమార్గములై తోఁచున్ చ. తీపుల అల్పపుచదువుల తెలివేలా కలుగు కాపై మిడుఁగురుబురువులఁ గడచునె చీఁకట్లు పైపై ప్రాకృతబ్రిష్టికి పరమేలా కలుగు పాపము కనుమూయలవలె భ్రమయించుఁ గాక చ. కొద్దెరఁగని జడునికి సదుణ మేలా కలుగూ అద్దము చిలు ముబ్బినక్రియ అజ్ఞానము వొడమున్ నిద్దము కామాతురునకు నిజ మేలా తెలియూ వద్దనె యండమావులవలెఁ దోఁచుఁ గాక