పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

510 అడలి దానవుల హనుమంతుఁడు బెడిదంపుఁ బెనుదోఁక బిరబిరం దిప్పి మొత్తె అడఁగ మాల్యవంతు హనుమంతుఁడు చ. దాకాల మో(కాలఁ దాటించెఁ గిరెందలి ఆకాశవీధినుండి హనుమంతుఁడు పైకొని భుజములఁ బడఁదాఁకెఁ గొందరి ఆకడ జలధిలోని హనుమంతుఁడు చ. అరుపుల నూరుపుల నందలిఁ బారఁగఁ దోలె ఔరా సంజీవికొండ హనుమంతుఁడు మేరతో శ్రీవేంకటాద్రిమీఁది దేవుని బంటు ఆరితేరిన బిరుదు హనుమంతుఁడు రేకు: 0304-04 లలిత సంపుటము:04-022 పల్లవి: ఘనుఁడాతఁడే మముఁ గాచుఁగాక హరి అనిశము నే మిఁక నతనికె శరణు చ. యెవ్వనినాభిని యీ బ్రహ్మాదులు యెవ్వఁడు రక్షకుఁ డిన్నిటికి యెవ్వనిమూలము యీ సచరాచర మవ్వలనివ్వల నతనికే శరణు చ. పురుషోత్తముఁడని పొగడి రెవ్వరిని కరి నెవ్వఁడు గక్కనఁ గాచె ధర యెవ్వఁడెత్త దనుజులఁ బొరిగెను అరుదుగ మే మిఁక నతనికె శరణు చ. శ్రీపతి యెవ్వనిఁ జేరి వురమునను భాసిల్లె నెవ్వఁడు పరమంబై దాసుల కొరకై తగు శ్రీవేంకట మూస చూపె నిత్రC డతనికె శరణు రేకు:0069-06 ధన్నాశి సంపుటము: 01-363 పల్లవి: ఫెురదురితములచే గుణవికారములచే నీరీతిఁబడునాకు నేది దెరువు చ. హరి జగన్నాథు లోకరాధ్యు నెరఁగనేరనివాని కేది దెరువు పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి నిరవుకొలుపనివాని కేది దెరువు చ. శ్రీ వేంకటేశుఁ దలంచినవెనక సకలంబు . నేవగింపనివారి కేది దెరువు దేవోత్తముని మహిమ దెలిసి తెలియఁగలేని యీ వివేకంబునకు నేది దెరువు రేకు:0011-02 నాట సంపుటము: 01-068 పల్లవి: ఘనోరవిచారణ నారసింహ నీవీరూపముతో నెట్లుండితివో చ. ఉడికెడికోపపుటూర్పులఁ గొండలు పొడివొడియై నభమునకెగయ బెడిదపురవమున పిడుగులు దొరుగఁగ యెడనెడ నీవపుడెట్లుండి తివో చ. కాలానలములు గక్కుచు నయనజ్వాలల నిప్పులు చల్లుచును భాలాక్షముతో బ్రహ్మండకోట్లకేలికవై నీవెట్లుండితివో చ. గుటగుటరవములు కుత్తికఁగులుకుచు గిటగిటఁ బండ్లు గీఁటుచును తటతటఁ బెదవులు దవడలు వణఁకఁగ ఇటువలె నీవపుడెట్లుందితివో చ. 4: గోళ్ళమెఱుఁగుల కొంకులపెదపెద వేళ్ళ దిక్కులు వెదకుచును