పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

508 నిత్యుఁడు శ్రీహరి నిర్మలుఁడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో యితని చ. చాటెడి చాటెడి సకలవేదములు పాటించిన హరి పరమమని కూటఁసుఁ డితఁడు గోపవధూపతి కోటికి యూత్రనిఁ గొలువరో జనులు చ. నిలుచున్నాఁ డిదే నేఁడును నెదుటను కలిగిన శ్రీవేంకటవిభుఁడు వలసినవారికి వరదుఁడీతఁడు కలఁడు గలఁ డితనిఁ గని మనరో రేకు:0295-02 సామంతం సంపుటము: 03-549 పల్లవి: గోవిందుదాసులమై కొన కెక్కుదుముఁ గాక వేవేలు విధుల నమ్మి వెతఁబడఁగలమా చ. మనసు లోపలి మామర్మము దెలియలేము ఘనుఁడైన హరి నెట్టు గానఁగలము తనువుతో భోగాలు తగులు వీఁడగలేము వెనక కర్మపాశాలు వీడించుకోఁగలమా చ. వడిఁ బెట్టే యింద్రియాల వద్దని మానుపలేము తొడలి సంసారము తోయఁగలమా బడిబడి నానాటి బతుకు చెప్పుకోలేము పాడలేటి యితరుల బోధించఁగలమా చ. కొంకక ఆడిన మాట గురుతు వెట్టఁగలేము లంకె వేదవాక్యము దలఁచఁగలమా యింకా శ్రీవేంకటేశుఁడితఁడే మా దేవుఁడని సంకెలేకుందుముఁ గాక జాలిఁబడఁగలమా పె.అ.రేకు: 0037-04 గౌళ సంపుటము: 15-210 పల్లవి: ఘన నంసారులకెల్ల కర్మమై పొడచూపు ననిచి యింతకు గురి నరహరి వొక్కఁడు చ. యెలమిఁ బుణ్యము లెల్ల యింద్రలోకమై తోఁచు నలుఁడ పాపములే నరకలోకమై తోఁచు పొలసి రెండు సరియైతే భూలోకమై తోఁచు కలవాఁ డొక్కఁడే గుఱి కమలావిభుఁడు చ. పరగ రాజసులకు బ్రహ్మయై పొడచూపు గరిమ తామసులకు కఱకంఠుడై యుండు సిరుల సాత్వికులకు శ్రీకాంతుఁడై మించు నిరవైనవాఁడు శ్రీహరి యొక్కఁడే చ. ఆయమెఱిఁగినవారి కంతరాత్మయై యుండు చాయ గన్నవారికి జగమెల్లనై తోఁచు చేయ గన్నవారికి శ్రీ వేంకటేశుఁడై తోఁచు యేయోడ వారికి యీ దేవుఁ డొక్కఁడే రేకు: 0049-06 సామంతం సంపుటము: 01-303 పల్లవి: ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగాని జనుల కెప్పుడు నాత్మసాఖ్యంబు లేదు చ. ప్రతిలేనిదైర్యంబు పదిలపరచినఁ గాని