పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

506 కలలోని కాపురముఁ గైవల్యమే బెళకు నాలుకకు నీపేరు వచ్చితేఁజాలు పలికిన వన్నియు పరమవేదములే చ. తొడరి నీపూజ చేత దొరకితేనే చాలు పడుచుల బొమ్మరిండ్లు బ్రహ్మలోకమే కడలేని నీభక్తి గలిగితేనే చాలు కడజన్మమయినా నిక్కపు విప్రకులమే చ. కాయముపై నీముద్ర గానవచ్చితేనే చాలు పాయపు రతిసుఖము పరతత్వమే యేయేడ శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి పోయిన నా పాపమెల్లాఁ బుణ్యకర్మమే పె.అ.రేకు : 0033-03 ముఖారి సంపుటము: 15-186 పల్లవి: గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవు గలుగఁగ పిందె పుట్టె నింతే కాక చ. బూమిలో నిద్రించువాఁడు పొద్దు వేళ యేటి(గీనా నీమాయలో మునిఁగి నన్ను నెఱిఁగీనా కామించి నీవు నన్నుఁ గరుణించి యేలుకోఁగా నీమఱఁగువాఁడ నని నేఁ డంటీఁ గాక చ. సరి చంటి బిడ్డఁడు సంసార చింత లెంచీనా గరిమ నజ్ఞానుఁడు కైంకర్యమెంచీనా నిరతి దయ దలఁచి నీవు పెర రేఁపఁగా కెరలి నే నీకు మొక్కితిఁ గాక చ. తుద కెక్క సన్యాసి తొంటి కర్మము సేసిన యిదివో నిన్నుఁ దలఁచి యీతలఁ దడవేనా యెదుట శ్రీ వేంకటేశ యిహపరములు నీవై పొదిగి పాలార్చఁగాను పొడవైతిఁ గాక రేకు:0220-02 గుండక్రియ సంపుటము: 03-109 పల్లవి: గోవింద హరిగోవింద గునిసి యూడుదం బిటురారో ఆవటించి మనమెట్టు గడచెదము ఆశ్చరియంబిది హరిమాయా చ. కర్మానుగుణము కాలము ధర్మానుగుణము దైవము మర్మము రెంటికి మనుజుఁడు అర్మిలిఁ బొదిగీ హరిమాయా చ. అజ్ఞానహేతువు లాసలు విజ్ఞానహేతువు విరతోకటి తజ్ఞలు రెంటిఁ దగిలిల (?) జిజ్ఞాను(సు?)గప్పెను శ్రీహరిమాయా చ. సకలకారణము సంసారము ప్రకటకారణము ప్రపంచము (?) అకటా శ్రీవేంకటాద్రీశుదాసులు వొకరిఁ దడవదువో పూలమాయూ పె.అ.రేకు: 0031-01 పాడి సంపుటము: 15-171 పల్లవి: గోవిందా నే నిట్టివాఁడ గురుతు నిన్నెటిఁగీనా యీ విన్నప మిది నాది యింకా నీ చిత్తము చ. పొలఁతుల భావ మనేభూతము సోఁకినవాఁడు