పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

505 యెన్నఁగ బుట్టు గులివె వేరు నన్ను నెవ్వరున్నతి బోధించిన నిన్న నేటనే నేనెఱిఁగేనా చ. చిత్తము నాఁటిదే చింతలు నాఁటివే యిత్తల భోగములివె వేరు సత్తగు శాస్త్రము చాయ చూపినా కొత్తగ నేనిఁక గుణినయ్యేనా చ. జీవాంతరాత్ముఁడు శ్రీవేంకటేశుఁడే యీవల భావనలివె వేరు ధావతి కర్మము తప్పదీసినా దైవము గావక తలఁగీనా పె.అ.రేకు:0014-03 బౌళి సంపుటము: 15-076 పల్లవి: గోవింద కేశవ నీకు కుయ్యో మొట్టో వోవల నీపాలఁ జిక్క దోహో నామనసు చ. వొకటిపైఁ గాంక్షించు వొకటిపై వేసారు వొకవేళ దుర్మాన మొడిగట్టును వికలుఁడై యంతలోనే విషయపు బారిఁ జిక్కు ఆకటా యిన్నిటాఁ దుమురాయఁబొ నామనసు చ. తలపాశీసు నొకవేళ తమకించు నొకవేళ వొలుకుఁగోపము చల మొకవేళ కలగించు నొకవేళ గర్వించు నొకవేళ పాలసి యిన్నిటా వీదిఁ బోయఁబో నా మనసూ చ. సంతసించు నొకవేళ జయమందు నొకవేళ పంతమాడు నొకమట్టు పడినవేళ యింతలో నీవు శ్రీ వేంకటేశ కావకయుండితే రంతుల నేమీఁ జెప్పరాదువో నామనసూ చి.ఆ.రేకు:0001-02 బౌళి సంపుటము: 10-002 పల్లవి: గోవింద గోవింద యని కొలువరె గోవిందా యని కొలువరె చ. హరి యచ్యుతా యని యూడరె పురుషోత్తమా యని పొగడరె పరమ పురుషా యని పలుకరె సిరివర యనుచునుఁ జెలఁగరే జనులు చ. పాండవ వరద యుని పాడరె అండ23 వాహనుఁ గోరెనియూడరె కొండలరాయనినే కోరరె దండితో మాధవునినే తలఁచరె జనులు చ. దేవుఁడు శ్రీవిభుఁడని తెలియరె సాశీవల ననంతునిఁ జూడరె శ్రీవేంకటనాధునిఁ చేరరె పావనమై యొప్పుడును బ్రదుకరే జనులు రేకు: 0322-08 శ్రీరాగం సంపుటము: 04–128 పల్లవి: గోవింద నీవన్నిటిలోఁ గూడితేఁ జాలుఁగాని యీవల సంసారమైన యిది ధ్రువపట్టమే చ. తలఁపు లోపల నీవు దగ్గరితేనే చాలు