పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

503 గడుగకొననే పట్టెఁ గలకాలము ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ దడవఁగా గొంతయుఁ బొద్దులేదు చ. కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె కలుషదేహపు బాదం గలకాలము తలపాకిసి తనపాలిదైవమైనహరి దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు చ. శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె గలిములఁ గపటాలఁ గలకాలము తిరువేంకటగిరి దేవుఁడైన హరి దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు రేకు: 0136-05 మాళవి సంపుటము:02-152 పల్లవి: గుట్టాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు చ. సరి పిఱుఁదే రెండు జంటబండికండు సరవితోఁ బాదాలు చాఁపునొగలు గరిమఁజూపులు రెండు గట్టిన పగ్గములు దొరయై దేహరథము దోలీఁబో జీవుఁడు చ. పంచమహాభూతములు పంచవన్నెకోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియరథము పఱపీఁబో జీవుఁడు చ. పాపపుణ్యములు రెండు పక్కనున్నచీలలు తోపుల యన్నపానాలు దొబ్బుఁదెడు యేపున శ్రీవేంకటేశుఁ డెక్కి వీథుల నేఁగఁగ కాపాడి నరరథము గడపీఁబో జీవుఁడు రేకు: 0314-06 దేసాళం సంపుటము: 04-083 పల్లవి: గుల్ల గుల్లే రాయి రాయే గురి యెంతవేసినాను అల్లనాఁడే అడియాస లవియేల విడుతు చ. మహిలోన రోగములు మాన మందు గద్దుగాక సహజగుణము మాన్పఁజాలుమందు గలదా బహుబంధములు నీవే పాపితే నేమోకాని అహరహమును నేనే అవియేల విడుతు చ. తనరూపమద్దములో తగఁ జూడవచ్చుఁగాక మనసు దా నద్దములో మరి చూడవచ్చునా దినచంచలము నీవే తీర్చితేనేమో కాని అనుఁగు సంశయము నేనదియేల విడుతు చ. నాలుకచే రుచులెల్ల నంజి చూడవచ్చుఁగాక జాలిఁబడ్డ కన్నులచేఁ జవి గానవచ్చుఁగాక యేలి శ్రీవేంకటేశ నీవిట్టే కాతువుగాక వేళ జీవుఁడను నా విధమేల విడుతు పె.అ.రేకు:0072-05 సాళంగనాట సంపుటము: 15-415 పల్లవి: గెలిచితి భవముల గెలిచితిఁ గామాదుల యిల నీ వేలికవైతి వింక నేడ వెఱపు చ. హరి నీకు నే దాసుఁడ ననే దొక సలిగ