పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

502 ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి వేడుకలు మీరఁగ శ్రీవిభుని పెండ్లికిని చ. కురిసెఁ బువ్వలవాన కుప్పలై యెందు చూచిన మొరసె దేవదుందుభి మోఁతలెల్లను బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి తిరమై మించిన దేవదేవుని పెండ్లికిని చ. వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల పోసిరదే తలఁబ్రాలు పుణ్యసతులు ఆసల శ్రీవేంకటేశుఁడలమేలుమంగఁ దాను సేసలు వెట్టినయట్టి సింగారపు పెండ్లికి రేకు: 0390-03 రామక్రియ సంపుటము: 04-522 పల్లవి: గరుడాద్రి వేదాద్రి కలిమి యీ పె సిరులొసఁగీఁ జూడరో చింతామణి యీ పె చ. పాల జలధిఁ బుట్టిన పద్మాలయ యీ పె లాలిత శ్రీ నరసింహులక్ష్మియీ పె మేలిమి లోకమాతయై మించిన మగువ యీ పె CN බීෆ ඡීජුකාලීෂී කොටඩර COA చ. ఘన సంపద లొసఁగు కమలాకాంత యూపె మనసిజుఁ గనిన రమూస త్రి యూపె అనిశమC బాయని మహా హరి ప్రియ యినా పె ధన ధాన్య రూపపు శ్రీ తరుణి యీ పె చ. రచ్చల వెలసినట్టి రమా వనిత యీ పె మచ్చిక గలయలమేల్ (మంగ యీ పె యిచ్చట వేంకటాద్రి నీ యహోబలమునందు నిచ్చలూఁ దావు కొనిన నిధాన మీపె చి.ఆ.రేకు:0010-06 వరాళి సంపుటము: 10-060 పల్లవి: గాడిదెపిల్ల కోమలికమె కలిగినది వేడుక పడు సంసారమె విసిగించు వెనక చ. అగపడు సంపదమీదట నాసలు కడుఁ బుట్టు వగ నది భరియింప వసమె కాదయ్య మొగమె చూడఁగ నాపై ముదమునఁ గనుపట్టు పొగులఁగ గరచెటికాట్లు పులికంటె బెట్టు చ. విడువని భోగంబులపై వేడుక కడుఁ బుట్టు తడఁబడులంపట మైతే తలఁచనె రాదయ్య తొడి మెను మాగినపండైతే తోఁచుఁ జూచినను వడియఁబడి గొడ్డంటికి వసమె కాదెవుడు చ. మోవఁగ విషయంబులపై మోహము కడుఁ బుట్టు శ్రీవెంకటనాథా అది చెప్పఁగ రాదయ్య ఆవలఁజూడఁగఁ జల్లనై వుండుఁ గాని తేవలఁ గూఁకటవేళ్లు తెగఁ బారును మిగులా రేకు:0003-01 కన్నడ గౌళ సంపుటము: 01-014 పల్లవి: గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు చ. అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు