పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

499 వెన్నదిన్నవాఁడు వీఁడు గదె పన్నారుదొంతులపాలుఁబెరగులు యిన్ని నారగించె యినాతఁడు గదవె చ. మెఱసి యట్టుగమీఁదిచక్కిలాలు వెఱఁజి కైకొనె వీఁడె కదె కఱమి కఱిమి నములు గంపల నురుగులు රැෆිෂ්ෆර් ඩෲෆඨිමි ෆෂථායී ඡයයි చ. శ్రీవేంకటాద్రి దాఁచిన తేనెలెల్లా వేవేగ సాధించె వీఁడే కదె కావించెల మేలుమంగపతెయి మమ్మేలె యేవంకఁ జూచినా యీతఁడే కదవే రేకు: 0157-06 సాళంగనాట సంపుటము:02-275 పల్లవి: కౌసల్యానందనరామ కమలాప్తకులరామ భాసురవరద జయు పరిపూర్ణరామ చ. మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు జనించి తాటకం జంపి జన్నము గాచి వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి అనుమతి పరశురామునిచేఁ గైకొంటివి చ. సుప్పనాతి శిక్షించి సారిది రుషులఁ గాచి అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి చొప్పతో మాయమృగము సోదించి హరియించి కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటివి చ. సాలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక జలధి బంధించి లంక సాధించి వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించి చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా రేకు: 0158-01 గౌళ సంపుటము:02-276 పల్లవి: గట్టిగాఁ దెలుకొంటే కన్నదే కంటి గురుమ (తు ?) దట్టమైన సుజ్ఞానము తనలోనే వున్నది చ. బయలే పంటలు వండె బయలే పాఁడి విదికె బయలు ప్రపంచమై భ్రమయించెను బయటనే ప్రకృతియు బయటనే జీవులు బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయె చ. ఆకసము చూలాయు నాకసము రూపులాయు నాకసము సంసారమై యలవడెను ఆకసాన దివియును నాకసాన లోకములు ఆకసాన శ్రీహరి యవతారమందెను చ. అంతరంగమే భోగము అంతరంగమే యోగము అంతరంగమే అన్నిటి కావాసమయ్యే అంతరంగాన శ్రీవేంకటాధిపుఁ డున్నవాఁడు అంతరంగాన మోక్షము అతఁడే యొసంగెను రేకు:0029-02 కాంబోది సంపుటము: 01-177 పల్లవి: గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ వొడ్డినభవము దన్ను వోడ కమ్ముఁగాక చ. చించుక మిన్నులఁ బారేచింకలను బండిఁ గట్టి