పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

500 వంచుకొనేమన్న నవి వసమయిన్యానా యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు పారించి పారించి వలపులు బొండఁబెట్టుఁగాక చ. మంటమండేయ దెచ్చి మసిపాఁత మూఁటగట్టి యింటిలోన దాఁచుకొన్న నితవయిన్యానా దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు బంటుఁజేసి ఆసలనే పారఁదోసుఁగాక చ. పట్టరాని విషములపాముఁ దెచ్చి తలకిందఁ బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువనివట్టిమనుజుల పెడవాడఁబెట్టఁగాక రేకు:0175-04 దేసాళం సంపుటము: 02-372 పల్లవి: గతులన్ని ఖలమైన కలియుగమందును గతి యీతఁడే చూపె ఘనగురుదైవము చ. యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి మీతనివల్లనే కంటి మీతిరుమణి యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్రమీతఁడే రామానుజులు యిహపరదైవము చ. వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు చలిమి నీతఁడే చూపె శరణాగతి నిలిపినాఁడీతఁడేకా నిజముద్రధారణము మలసి రామానుజులే మాటలాడే దైవము చ. నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము రేకు: 9108-02 సామంతం సంపుటము: 04-596 పల్లవి: గద్దరి జీవుఁడు కామధేనువు మాని యెదుఁ బిదుకఁ జొచ్చెనేది దెరఁగు చ. మటమూయములఁ దనమనసె చOచలముOది ఇటునటుఁ దిరిగిన నేది దెరఁగు కటకట వూరేలు కర్రే దొంగలఁగూడి యెటువలెఁ జేసిన నేదిదేరఁగు చ. కల్లలాడఁగఁ జొచ్చెఁ గలుషపుమతి సత్య మిల్లు వెడలగొట్టె నేదిదేరఁగు చెల్లఁబో నోరే చేఁదుమేయఁగఁ జొచ్చె నెల్లవారికి నింక నేది దెరఁగు చ. తియ్యని వెంకటాధిపుఁ బాసి పరసేవ కియ్యకొనెడిఁ జిత్తమేది దెరఁగు అయొ్యు చక్కనిపతి నాలు విడిచిపోయి యొయ్యెడఁ దిరిగిన నేది దెరఁగు రేకు: 0302-03 ముఖారి సంపుటము:04-009 పల్లవి: గరిమతో వెరపేల కమలాక్షు దాసులకు పరమపద మొక్కటే ఫలమింతే కాక చ. పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు